కారుణ్య నియామక పత్రాలు అందజేసిన జీఎం

ABN , First Publish Date - 2021-06-20T05:59:21+05:30 IST

ఆర్‌జీ-1 పరిధిలో మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌ అయిన 16మంది ఉద్యోగుల పిల్లలకు శనివా రం జీఎం కల్వల నారాయణ అపా యింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇచ్చారు.

కారుణ్య నియామక పత్రాలు అందజేసిన జీఎం
ఉద్యోగులకు నియామక ఉత్తర్వులు అందజేస్తున్న జీఎం నారాయణ

గోదావరిఖని, జూన్‌ 19: ఆర్‌జీ-1 పరిధిలో మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌ అయిన 16మంది ఉద్యోగుల పిల్లలకు శనివా రం జీఎం కల్వల నారాయణ అపా యింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇచ్చారు. స్థానిక జీఎం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జీఎం మాట్లాడుతూ ఆర్‌జీ-1 పరిధిలో ఇప్పటివరకు 830మంది డిపెండెంట్‌ ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగా లు ఇచ్చామని, ఇందులో 18మంది మహిళలు కూడా అవకాశం కల్పించా మన్నారు. సీఎండీ శ్రీధర్‌ చొరవతో ని యామకాలు తొందరగా చేపడుతున్నా మని,మెడికల్‌ బోర్డుకు దరఖాస్తు చేసుకుని అన్‌ఫిట్‌ అయినవారికి వెంటనే ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పా రు. సింగరేణికి యువకులు రావడం వరంలాంటిందని, రోజురోజుకు సింగరే ణి సంస్థలో యువకుల ఉద్యోగ స్థాయి పెరుగుతుందని చెప్పారు. అతితక్కువ సమయంలోనే వీరికి పోస్టింగ్‌లు ఇస్తా మని, సీనియర్లవద్ద మెళకువలు నేర్చుకుని సింగరేణి అభివృద్ధికి పాటుపడాలని, రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి చేయాలని సూచించారు. టీబీజీకేఎస్‌ ఉ పాధ్యక్షులు గండ్ర దామోదర్‌రావు, పర్సనల్‌ డీజీఎం సీహెచ్‌ లక్ష్మీనారాయ ణ, సారంగపాణి పాల్గొన్నారు.

Updated Date - 2021-06-20T05:59:21+05:30 IST