జీఎంఆర్‌, గ్రూపే ఏడీపీ ఒప్పందం

ABN , First Publish Date - 2021-07-28T06:48:55+05:30 IST

విమాన ప్రయాణికులకు, విమానయాన సంస్థలకు మరింత మెరుగైన సేవలు, సదుపాయాలు కల్పించడానికి గ్రూపే ఏడీఆర్‌తో జీఎంఆర్‌ గ్రూప్‌ చేతులు కల్పింది.

జీఎంఆర్‌, గ్రూపే ఏడీపీ ఒప్పందం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): విమాన ప్రయాణికులకు, విమానయాన సంస్థలకు మరింత మెరుగైన సేవలు, సదుపాయాలు కల్పించడానికి గ్రూపే ఏడీఆర్‌తో జీఎంఆర్‌ గ్రూప్‌ చేతులు కల్పింది. ఈ మేరకు రెండు కంపెనీలు పారిశ్రామిక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. పరస్పర శక్తి సామర్థ్యాలను పెంచుకోవడానికి ఈ ఒప్పందం దోహదం చేస్తుందని జీఎంఆర్‌ తెలిపింది. ప్రయాణికులకు మెరుగైన సేవలందించడానికి, విమానాశ్రయాల నిర్వహణ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ తదితర విభాగాలకు ఈ ఒప్పందం వల్ల మేలు జరుగుతుందని జీఎంఆర్‌ గ్రూప్‌ (ఎయిర్‌పోర్ట్స్‌) చైర్మన్‌ జీబీఎస్‌ రాజు తెలిపారు. 

Updated Date - 2021-07-28T06:48:55+05:30 IST