ఎయిర్‌పోర్ట్‌ సిటీలో ఎడ్యుపోర్ట్‌

ABN , First Publish Date - 2020-08-11T09:24:10+05:30 IST

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు సిటీలో ఒక ప్రత్యేకమైన అర్బన్‌ ఎకో సిస్టమ్‌ను అభివృద్ది చేస్తున్న జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిరోట్రోపొలిస్‌ లిమిటెడ్‌

ఎయిర్‌పోర్ట్‌ సిటీలో ఎడ్యుపోర్ట్‌

సెయింట్‌ మేరీస్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీతో జీఎంఆర్‌ ఒప్పందం 

100 ఎకరాల్లో ప్రపంచస్థాయి ఎడ్యుకేషనల్‌ క్లస్టర్‌ నిర్మాణం

(ఆంధ్రజ్యోతి రంగారెడ్డి అర్బన్‌) : హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు సిటీలో ఒక ప్రత్యేకమైన అర్బన్‌ ఎకో సిస్టమ్‌ను అభివృద్ది చేస్తున్న జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిరోట్రోపొలిస్‌ లిమిటెడ్‌ (జీహెచ్‌ఎఎల్‌)...పలు విద్య, పరిశోధన సంస్థలను ఆకర్షించబోతోంది. ఇందుకోసం  100 ఎకరాల్లో ఎడ్యుపోర్ట్‌ నిర్మాణాన్ని వేగవంతం చేసింది.  దీనిలో బిజినెస్‌ స్కూల్‌, ఇంటర్నేషనల్‌ స్కూల్‌, ఏవియేషన్‌ అకాడమీ. ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌, ఫ్లైట్‌ ట్రైనింగ్‌, సిమ్యులేటర్‌ ట్రైనింగ్‌, ఇంజన్‌ మెయింటెనెన్స్‌ మొదలైనవి ఉంటాయు.  చిన్మయ విద్యాలయ, షూలిచ్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌,  జీఎమ్‌ఆర్‌ ఏవియేషన్‌ అకాడమీ, ఫ్లైట్‌ సిమ్యులేషన్‌ టెక్నిక్‌ సెంటర్‌ (ఎఫ్‌ఎ్‌సటీసీ), సీఎ్‌ఫఎం సౌత్‌ ఏషియా ట్రైనింగ్‌ సెంటర్‌, ప్రాట్‌ అండ్‌ విట్నీ ఇండియా ట్రైనింగ్‌ సెంటర్‌ వంటి  ప్రముఖ విద్యా సంస్థలు రానున్నాయి. ఎడ్యుపోర్టు విజన్‌కు మరింత ఊతమిస్తూ, జీఎంఆర్‌ ఇటీవల రెసిరెన్షియల్‌ అకాడమిక్‌ ఫెసిలిటీ అయిన సాంక్టా మారియా ఇంటర్నేషనల్‌ స్కూల్‌ నిర్మాణం కోసం హైదరాబాద్‌ కేంద్రంగా సెయింట్‌ మేరీస్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీతో ఒప్పందంపై సంతకాలు చేసింది. దీని ప్రకారం సాంక్టా మారియా స్కూలుకు  రెండో కే12 (కిండర్‌ గార్డెన్‌ నుంచి 12వ తరగతి వరకు) వెంచర్‌ కోసం ఎయిర్‌పోర్టు సిటీలో 15 ఎకరాల సర్విస్డ్‌ భూమిని కేటాయిస్తారు. సెయింట్‌ మేరీస్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ, జీఎంఆర్‌ హైదరాబాద్‌ పోర్ట్‌ సిటీలో విద్యాసంస్థను ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని బిజినెస్‌ చైర్మన్‌ బీజీఎస్‌ రాజు అన్నారు భారతదేశాన్ని ఒక గ్లోబల్‌ నాలెడ్జ్‌ సూపర్‌ పవర్‌గా రూపొందించడం కోసం అవసరమైన అఽధ్యయన పర్యావరణాన్ని సృష్టించడానికి కృషి చేస్తున్నామన్నారు.  జీఎంఆర్‌ గ్రూప్‌ ఒక అంతర్జాతీయ విద్యాసంస్థ ఏర్పాటు కోసం సెయింట్‌ మేరీస్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీతో ఒప్పందం ఎంతో సంతోషకరమని ఎయిర్‌పోర్ట్‌ ల్యాండ్‌ డెవల్‌పమెంట్‌ సీఈవో అమన్‌ కపూర్‌ అన్నారు. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు సిటీలో ఏర్పాటవుతున్న మొదటి విద్యాసంస్థ ఇదేనని చెప్పారు.


ప్రయోజనకరమైన విద్య కోసం కృషి చేస్తున్నాం..

ప్రయోజనకరమైన విద్యకోసం పిల్లలు అభివృద్ధి చెందడానికి ఒక సమగ్రమైన దృక్పథాన్ని అనుసరించాలన్న విశ్వాసం కలిగిన జీఎంఆర్‌ గ్రూపుతో జట్టు కట్టడంపై సెయింట్‌ మేరీస్‌ సొసైటీ ఎంతో ఆనందిస్తోంది. క్లిష్టమైన, అనేక కోణాలున్న పిల్లలు తమ సామర్థ్యాలను, సంబంధాలను, సంపూర్ధాభివృద్ధిని మెరుగుపరుచుకోవడంపై సాంక్టా మేరియా ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ప్రధానంగా దృష్టి సారిస్తుంది.  

       - బి. ఆరోగ్యరెడ్డి, ప్రెసిడెంట్‌ అండ్‌ చైర్మన్‌, సెయింట్‌ మేరీస్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ

Updated Date - 2020-08-11T09:24:10+05:30 IST