అప్రాధాన్య ఆస్తుల్లో వాటా విక్రయం: జీఎంఆర్‌

ABN , First Publish Date - 2020-08-04T06:12:11+05:30 IST

భూమితోపాటు అప్రాధాన్య ఆస్తుల్లో వాటాను విక్రయించాలని జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా భావిస్తోంది. 50 శాతం భూమిని విక్రయించినా

అప్రాధాన్య ఆస్తుల్లో వాటా విక్రయం: జీఎంఆర్‌

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి బిజినెస్‌): భూమితోపాటు అప్రాధాన్య ఆస్తుల్లో వాటాను విక్రయించాలని జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా భావిస్తోంది. 50 శాతం భూమిని విక్రయించినా గణనీయమైన నిధులు రాగలవని, వీటితో రుణభారాన్ని మరింతగా తగ్గించుకోవచ్చని యోచిస్తోంది. కంపెనీకి దాదాపు 10,500 ఎకరాల స్థలం ఉంది. చైనాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు తమ కార్యకలాపాలను భారత్‌కు తరలించాలని యోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యూహాత్మక ప్రాంతాల్లో ఉన్న స్థలాన్ని విక్రయించడం వల్ల మెరుగైన విలువను పొందవచ్చని అంచనా వేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ స్పెషల్‌ ఇన్వె్‌స్టమెంట్‌ రీజియన్‌లో భూమిని సొమ్ము చేసుకోవడానికి కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. 

Updated Date - 2020-08-04T06:12:11+05:30 IST