జాషువా కవిత్వం అజరామరం

ABN , First Publish Date - 2020-09-25T10:44:59+05:30 IST

మహాకవి జాషువా కవిత్వం అజరామరమని ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు రాచబాళెం చంద్రశేఖరరెడ్డి తెలిపారు. జాషువా 125వ జయంతి వారోత్సవాలలో భాగంగా మూడోరోజైన గురువారం కళాపీఠం కార్యదర్శి డాక్టర్‌ నూతక్కి సతీష్‌ అధ్యక్షతన జరిగిన ఆన్‌లైన్‌లో ‘జాషువా కవిత్వం సామాజికత’ అనే అంశంపై సమావేశం జరిగింది

జాషువా కవిత్వం అజరామరం

గుంటూరు(సాంస్కృతికం), సెప్టెంబరు 24: మహాకవి జాషువా కవిత్వం అజరామరమని ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు రాచబాళెం చంద్రశేఖరరెడ్డి తెలిపారు. జాషువా 125వ జయంతి వారోత్సవాలలో భాగంగా మూడోరోజైన గురువారం కళాపీఠం కార్యదర్శి డాక్టర్‌ నూతక్కి సతీష్‌ అధ్యక్షతన జరిగిన ఆన్‌లైన్‌లో ‘జాషువా కవిత్వం సామాజికత’ అనే అంశంపై సమావేశం జరిగింది.


ఈ సందర్భంగా చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ కవులు సహజంగా పట్టించుకోని చిన్న విషయాలను కూడా తన రచనలలో జాషువా ప్రతిక్షేపించారన్నారు. కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత డాక్టర్‌ పాపినేని శివశంకర్‌ మాట్లాడుతూ అభ్యుధయ భావ కవిత్వాలను అనుసరించకుండా ప్రత్యేక బాణిలో జాషువా రచనలు చేశారన్నారు. కార్యక్రమంలో జాషువా కళాపీఠం అధ్యక్షుడు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-25T10:44:59+05:30 IST