Abn logo
Sep 19 2021 @ 00:30AM

జీవో 217ను రద్దు చేయాలి

సబ్‌కలెక్టరేట్‌ వద్ద మాట్లాడుతున్న బెస్తసంఘం నాయకులు

మదనపల్లె టౌన్‌, సెప్టెంబరు 18: మత్స్యకారులకు ఉరితాడుగా మారనున్న జీవో నెం.217ను రద్దు చేయాలని ఆలిండియా బెస్త సంఘం జాతీయ సహాయ కార్యదర్శి ఎం.రమణ డిమాండ్‌ చేశారు. శనివారం సబ్‌కలెక్టరేట్‌ వద్ద సంఘ నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ... చెరువులను ఆన్‌లైన్‌ వేలంపాటల ద్వారా పొందాలన్న  217 జీవో వలన మత్స్యకారులు జీవనోపాధిని కోల్పోవడంతో పాటు మత్స్య సహకార సంఘాలు నిర్వీర్యమవుతాయన్నారు. మత్స్యకారులకు తీరని ద్రోహం చేస్తున్న ఈ జీవో రద్దు కోసం ఈనెల 20వ తేదిన అన్ని జిల్లాల కలెక్టరేట్‌లో బెస్తసంఘాల నాయకులు వినతిపత్రాలు ఇస్తారన్నారు. ఇందులో భాగంగా సోమవారం చిత్తూరు కలెక్టరేట్‌కు జిల్లాలోని మత్స్యకారులు, బెస్త సంఘాల నాయకులు వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాని కోరారు. కార్యక్రమంలో రాజగోపాల్‌, ఎం.చంద్ర, విజయభాస్కర్‌, చిన్నప్ప పాల్గొన్నారు.