గో ఎయిర్‌ ఇక గో ఫస్ట్‌

ABN , First Publish Date - 2021-05-14T05:33:28+05:30 IST

గో ఎయిర్‌ పేరు ఇక నుంచి గో ఫస్ట్‌ కానుంది. వాడియా గ్రూప్‌నకు చెందిన గో ఎయిర్‌ 15 ఏళ్ల విమానయాన చరిత్ర అనంతరం బ్రాండ్‌ పేరును మార్చింది. భారీ విస్తరణ...

గో ఎయిర్‌ ఇక గో ఫస్ట్‌

ముంబై : గో ఎయిర్‌ పేరు ఇక నుంచి గో ఫస్ట్‌ కానుంది. వాడియా గ్రూప్‌నకు చెందిన గో ఎయిర్‌ 15 ఏళ్ల విమానయాన చరిత్ర అనంతరం బ్రాండ్‌ పేరును మార్చింది. భారీ విస్తరణ కోసం మార్కెట్‌ నుంచి నిధులు సమీకరించనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఈ సంస్థ తొలిసారిగా 2014 సంవత్సరంలో విమానయాన మార్కెట్లో 10 శాతం మైలురాయిని అధిగమించింది. కరోనా తీవ్రత, విమానయానంపై దాని ప్రభావం నేపథ్యంలో ఈ ఏడాది మార్చి నాటికి 7.8 శాతం మార్కెట్‌ వాటా కలిగి ఉంది. 

Updated Date - 2021-05-14T05:33:28+05:30 IST