ప్రధాన కాల్వలోకి దిగొద్దు : ఈఈ రమేశ్‌

ABN , First Publish Date - 2021-03-05T05:18:19+05:30 IST

4వ విడత నిజాంసాగర్‌ ప్రధాన కాల్వ వెంట నీటిని విడుదల చేస్తున్నందున రైతులు, ప్రజలు ప్రధాన కాల్వలోకి దిగవద్దని నీటి పారుదల శాఖ ఈఈ రమేష్‌ సూచించారు.

ప్రధాన కాల్వలోకి దిగొద్దు : ఈఈ రమేశ్‌

నిజాంసాగర్‌, మార్చి 4 : 4వ విడత నిజాంసాగర్‌ ప్రధాన కాల్వ వెంట నీటిని విడుదల చేస్తున్నందున రైతులు, ప్రజలు ప్రధాన కాల్వలోకి దిగవద్దని నీటి పారుదల శాఖ ఈఈ రమేష్‌ సూచించారు. గురువారం నిజాంసాగర్‌ ప్రధాన కాల్వ నీటి ప్రవాహాన్ని ఆయన పరిశీలించారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి కాల్వలోకి 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని, ఈ నీరు వేగంగా వెళుతుందని, కాల్వలోకి దిగితే ప్రమాదాలు సంభవిస్తాయన్నారు. మరో ఆరు రోజుల పాటు ప్రధాన కాల్వ నీటి విడుదల కొనసాగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నీటిని డిస్ర్టిబ్యూటర్‌ 39 వరకు విడుదలవుతుందన్నారు. ఆయన వెంట డిప్యూటీ ఈఈ దత్తాత్రేయ, ఏఈఈ శివ ప్రసాద్‌లున్నారు. 


Updated Date - 2021-03-05T05:18:19+05:30 IST