మా శవాలపై నుంచి వెళ్లి పనులు చేయండి

ABN , First Publish Date - 2020-09-19T10:36:15+05:30 IST

మండలంలోని మన్నేటికోట ఎస్సీ కాలనీ సమీపంలో 132 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు శుక్రవారం మరోసారి ఆందోళనకు దిగారు

మా శవాలపై నుంచి వెళ్లి పనులు చేయండి

సబ్‌ స్టేషన్‌ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ 

మన్నేటికోట ఎస్సీకాలనీ వాసుల ఆందోళన

ఉలవపాడు (మన్నేటికోట), సెప్టెంబరు 18 : మండలంలోని మన్నేటికోట ఎస్సీ కాలనీ సమీపంలో 132 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు శుక్రవారం మరోసారి ఆందోళనకు దిగారు. అక్కడ పనులు చేయాలం టే మా శవాలపై నుంచి నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. మన్నేటికోట ఎస్సీ కాలనీ సమీపంలో నిర్మాణం ప్రారంభించి స్థానికులు అడ్డుకోవ డంతో నిలిచిపోయిన సబ్‌స్టేషన్‌ను సబ్‌కలెక్టర్‌ భార్గవతేజ్‌, ట్రాన్స్‌కో సీఈ జె.వెంకట్రావులతో కలిసి ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి శుక్రవారం పరిశీలిం చారు.


ఈ సందర్భంగా ఆ కాలనీ వాసులు అక్కడికి వచ్చి తమ వ్యతిరేకత తెలిపారు. ఇక్కడ సబ్‌స్టేషన్‌ నిర్మించడం వలన భవిష్యత్తులో ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే వారిని స మాధాన పరిచే ప్రయత్నం చేశారు. ఇక్కడ 2017లో సబ్‌ స్టేషన్‌ మంజూరైందని ఆయన చెప్పారు.


  ప్రత్యామ్నాయంగా కాలనీకి అర కిలోమీటరు దూరంలో ఉన్న గ్రామ కంఠ భూములతోపాటు, దేవదాయ భూములను కూడా ఎమ్మెల్యే, అధికారులు పరిశీలించారు. అనంతరం వారు  విద్యా వనరుల కేంద్రంలో  విద్యా కానుక కిట్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే వెంట డీఎస్పీ కె. శ్రీనివాసరావు, సీఐ విజయ్‌కుమార్‌, విద్యుత్‌శాఖ ఇంజనీరింగ్‌ అధికారులు ఉన్నారు.    

Updated Date - 2020-09-19T10:36:15+05:30 IST