గోపూజతో మానవాళి శ్రేయస్సు

ABN , First Publish Date - 2022-01-17T06:40:03+05:30 IST

గోపూజతో మానవాళి శ్రేయస్సు

గోపూజతో మానవాళి శ్రేయస్సు
సామూహిక గోపూజా కార్యక్రమంలో యోగాచార్య అమిత్‌జీ

 యోగాచార్య అమిత్‌జీ

విజయవాడ రూరల్‌, జనవరి 16 : గోపూజతో మానవాళికి సమస్త దోషాలు తొలగిపోతాయని   నున్నలోని యోగా అభ్యాస్‌ ట్రస్ట్‌ ప్రధాన యోగాచార్య అమిత్‌జీ అన్నారు. నున్న కాశీ విశ్వేశ్వరస్వామి దేవస్ధానంలో సంక్రాంతి, కనుమ పండుగ సందర్భంగా ఆదివారం జరిగిన సామూహిక గోపూజా కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ సకల దేవతా స్వరూపమైన గోమాతను పూజించుటకు ఈ పండుగ ప్రసిద్ధిగాం చిందని వివరించారు. గోమాత ఉత్పత్తులు గొప్పద నాన్ని, విశిష్టతపై అనుగ్రహభాషణం చేశారు. దేవదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంప్రదాయంగా విశిష్టమైన గోపూజను నిర్వహించటం జరుగుతోందని దేవస్ధానం ఏవో ఎస్‌.అరుణ తెలిపారు. సంక్రాంతి సందర్భంగా నున్న కాశీ విశ్వేశ్వర, రామ లింగేశ్వర, గోదాదేవి,  వేణుగోపాలస్వామి దేవతా మూర్తుల గ్రామోత్సవం వైభవంగా జరిగింది. కార్యక్రమంలో అర్చక స్వాములు ఫణికుమార్‌, దత్తకుమార్‌, రామకృష్ణ భక్త బృందం పాల్గొన్నారు.

రామలింగేశ్వర స్వామి ఆలయంలో..

పెనమలూరు : రామలింగేశ్వరస్వామి ఆలయం లో కనుమ వేడుకను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రామలింగేశ్వర స్వామి కొండపై, సంతాన వేణుగోపాల స్వామి ఆలయం వద్ద గోపూజ నిర్వహిం చారు.  ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

తేలప్రోలు, ఇందుపల్లిలో..

ఉంగుటూరు  : సంక్రాంతి సంబరాలను మండలంలోని ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.   ఆదివారం కనుమ పండుగ సందర్భంగా తేలప్రోలులోని శ్రీవిశ్వేశ్వరస్వామి ఆలయం, ఇందుపల్లి శ్రీచెన్నకేశవస్వామి ఆలయాల్లో  ఆలయ ఈవో డి.ప్రకృతాంబ పర్యవేక్షణలో అర్చక స్వాములు వి.నరసింహకుమార్‌, ఎస్‌.సుందర్‌శేఖర్‌శర్మ, ఎస్‌.శివకుమార్‌ ఆధ్వర్యంలో గ్రామస్థులు, మహిళలు శాస్త్రబద్ధంగా గోపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గోమాతకు పసుపు. కుంకుమలు, పూలు, వస్రాతలు సమర్పించి, ఆహారాన్ని అందజేశారు. అనంతరం వైదిక పండితుల వేదమంత్రోచ్ఛరణల మధ్య గోమాతకు గ్రామస్థులు, మహిళలు శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాల ఈవో ప్రకృతాంబ మాట్లాడుతూ హిందూ ధర్మంలో గోవుకు విశిష్టమైన స్థానం ఉంద న్నారు. సకల దేవతలు కొలువైవున్న గోమాతను సేవించి, పూజించేవారికి ఆయురారోగ్యఐశ్వర్యాలతోపాటు, మోక్షప్రాప్తి కలుగుతుందని పేర్కొన్నారు. 

కాకులపాడులో..

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌  : రైతుకు వ్యవసాయ క్షేత్రంలో సహాయం చేయడం నుంచి పాడి ద్వారా కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడే పశువులకు కృతజ్ఞతగా వాటిని ప్రేమతో పూజించే పండుగే కనుమ అని కృష్ణా మిల్క్‌ యూనియన్‌ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు అన్నారు. కాకుల పాడులో నిర్వహించిన గోపూజకార్యక్రమంలో ఆయ న పాల్గొని పశువులకు పూజలు నిర్వహించారు. పల్లెల్లో పశువులే గొప్ప సంపదని, మన కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలబడటమేకాకుండా ప్రేమగా చూస్తే కుటుంబ సభ్యుల్లా కలిసి పోతాయన్నారు.    ఈ కార్యక్రమంలో పాడి రైతులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-01-17T06:40:03+05:30 IST