ప్రమోద్ సావంతే మా సీఎం అభ్యర్థి : గోవా బీజేపీ

ABN , First Publish Date - 2020-10-08T05:30:00+05:30 IST

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తానే కొనసాగుతానని గోవా సీఎం ప్రమోద్ సావంత్

ప్రమోద్ సావంతే మా సీఎం అభ్యర్థి : గోవా బీజేపీ

గోవా : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తానే కొనసాగుతానని గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రకటించారు. పార్టీ కార్యవర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని, అందుకే తానే సీఎం అభ్యర్థిగా కొనసాగుతానని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని బీజేపీ గోవా అధ్యక్షుడు సదానంద తానావడే కూడా ప్రకటించారు.


‘‘వచ్చే అసెంబ్లీ ఎన్నికలను ప్రమోద్ సావంత్ నేతృత్వంలోనే ఎదుర్కొంటాం’’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ... సహచార మంత్రులు కూడా వారి వారి శాఖలను సమర్థవంతంగానే నిర్వహిస్తున్నారని ఆయన కితాబునిచ్చారు. మహాదయీ నది నుంచి కర్నాటక ప్రభుత్వం నీళ్లను మళ్లించకుండా చూస్తామని, దీనికోసం వందశాతం కృషి చేస్తానని సావంత్ ప్రకటించారు. 

Updated Date - 2020-10-08T05:30:00+05:30 IST