గోవా డిప్యూటీ సీఎం ఫోన్‌ నుంచి వాట్సాప్‌ గ్రూప్‌నకు అసభ్యకరమైన వీడియో

ABN , First Publish Date - 2020-10-21T09:16:13+05:30 IST

గోవా ఉప ముఖ్యమంత్రి చంద్రకాంత్‌ బాబు కావ్‌ళేకర్‌ ఫోన్‌ నుంచి ఓ అసభ్యకరమైన వీడియో క్లిప్‌ ఆయన సభ్యుడిగా ..

గోవా డిప్యూటీ సీఎం ఫోన్‌ నుంచి  వాట్సాప్‌ గ్రూప్‌నకు  అసభ్యకరమైన వీడియో

నా ఫోన్‌ను హ్యాక్‌ చేశారు: చంద్రకాంత్‌


న్యూఢిల్లీ, అక్టోబరు 20: గోవా ఉప ముఖ్యమంత్రి చంద్రకాంత్‌ బాబు కావ్‌ళేకర్‌ ఫోన్‌ నుంచి ఓ అసభ్యకరమైన వీడియో క్లిప్‌ ఆయన సభ్యుడిగా ఉన్న ఓ వాట్సాప్‌ గ్రూప్‌లో సర్క్యులేట్‌ అయింది. ఈ సంఘటన తనకు తెలియకుండానే జరిగిందని, తాను నిద్రలో ఉన్నప్పుడు తన ఫోన్‌ హ్యాక్‌ అయిందని ఆయన చెప్పారు. ఈ మేరకు సైబర్‌ విభాగానికి ఆయన ఫిర్యాదు చేశారు. తన ఫోన్‌ ద్వారా ఆ వీడియో సందేశం పంపిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాగా వాట్సాప్‌ గ్రూప్‌కు అసభ్యకరమైన వీడియో పంపినందుకు ఉప ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గోవా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఫిర్యాదు చేసింది. 

Updated Date - 2020-10-21T09:16:13+05:30 IST