Goaలో కన్నడిగుల ఓట్లకోసం కసరత్తు

ABN , First Publish Date - 2022-01-15T16:06:16+05:30 IST

గోవా శాసనసభ ఎన్నికలు మరో నెలరోజుల్లో కొనసాగనున్న తరుణంలో కన్నడిగుల ఓట్లను పొందేందుకు బీజేపీ కసరత్తు ప్రారంభించింది. గోవాలో 3 లక్షల మందికి పైగా కన్నడిగులు నివసిస్తున్నారు. వీరి ఓట్లను దక్కిం

Goaలో కన్నడిగుల ఓట్లకోసం కసరత్తు

- కన్నడ భవన్‌ నిర్మించేలా సీటీ రవి హామీ 

- సంక్రాంతి తర్వాత కాంగ్రెస్‌ నేతలు సైతం 


బెంగళూరు: గోవా శాసనసభ ఎన్నికలు మరో నెలరోజుల్లో కొనసాగనున్న తరుణంలో కన్నడిగుల ఓట్లను పొందేందుకు బీజేపీ కసరత్తు ప్రారంభించింది. గోవాలో 3 లక్షల మందికి పైగా కన్నడిగులు నివసిస్తున్నారు. వీరి ఓట్లను దక్కించుకునేందుకు గోవా రాష్ట్ర బీజేపీ ఇన్‌చార్జ్‌, జాతీ య ప్రధాన కార్యదర్శి సీటీ రవి సిద్ధమయ్యారు. గురువారం రాజధాని పనాజీలోని పార్టీ కార్యాలయంలో కన్నడముఖ్యులతో చర్చలు జరిపారు. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ సమక్షంలో జరిగిన సమావేశంలో గోవాలోని వాస్కో ప్రాంతంలో కన్నడభవన్‌ నిర్మించేందుకు సీటీ రవి హామీనిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోవాలో బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని, కన్నడిగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కన్నడభవన్‌ నిర్మాణానికి రూ.10 కోట్లు ప్రకటించారు. బిర్లాగ్రూప్‌ ద్వారా స్థలాన్ని మంజూరు చేయిస్తానని దేవేంద్ర ఫడ్నవీస్‌ హామీ ఇచ్చారు. కాగా గోవా కన్నడిగులతో చర్చలకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సిద్దమయ్యారు. సంక్రాంతి తర్వాత పలువురు ప్రముఖ నేతలు గోవా వెళ్లి కన్నడిగులను మద్దతు కోరనున్నారు. పార్టీ సీనియర్‌ నేతలు ఆర్‌వీ దేశ్‌పాండే, హెచ్‌కే పాటిల్‌ తదితర నేతలు గోవా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. 

Updated Date - 2022-01-15T16:06:16+05:30 IST