నెల రోజుల్లో 18 వేల మంది భారతీయులను స్వదేశానికి చేర్చిన గో ఎయిర్

ABN , First Publish Date - 2020-07-14T02:28:27+05:30 IST

బడ్జెట్ కేరియర్ గోయిర్ నెల రోజుల్లో 18 వేల మందికిపైగా భారతీయులను స్వదేశానికి చేర్చింది. మొత్తం

నెల రోజుల్లో 18 వేల మంది భారతీయులను స్వదేశానికి చేర్చిన గో ఎయిర్

ముంబై: బడ్జెట్ కేరియర్ గోయిర్ నెల రోజుల్లో 18 వేల మందికిపైగా భారతీయులను స్వదేశానికి చేర్చింది. మొత్తం 100కు పైగా విమానాల్లో 18,195 మంది భారతీయులను నెల రోజుల్లో స్వదేశానికి చేర్చినట్టు సోమవారం గోయిర్ పేర్కొంది. కరోనా వైరస్ నేపథ్యంలో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు జూన్ 10న గోయిర్ విమాన సర్వీసులను ప్రారంభించింది. తర్వాత క్రమంగా ‘వందే భారత్ మిషన్’ విమానాలు, ప్రైవేటు అంతర్జాతీయ చార్టర్లతో కలిసి సేవలను వేగవంతం చేసింది. 


జులై 10 నాటికి గల్ఫ్ దేశాల నుంచి 103 అంతర్జాతీయ చార్టర్లను అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్, కన్నూర్, కొచ్చి, కోల్‌కతా, లక్నో, ముంబైలకు నడిపినట్టు గోయిర్ తెలిపింది. భారతీయులను స్వదేశానికి తిరిగి రప్పించే ప్రయత్నంలో దేశానికి తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని, అది వందేభారత్ మిషన్ అయినా, అంతర్జాతీయ చార్టర్లు అయినా కావొచ్చని, పౌరులు తిరిగి తమ కుటుంబాలతో కలవడానికి అది సహాయ పడుతుందని గోఎయిర్ మేనేజింగ్ డైరెక్టర్ జెహ్ వాడియా పేర్కొన్నారు. సహచర భారతీయులు తమ ప్రియమైనవారి వద్దకు తిరిగి రావడానికి సహాయపడేందుకు అవసరమైన మరెన్నో వందే భారత్ మిషన్, ప్రైవేట్ చార్టర్ విమానాలతో గో ఎయిర్ ప్రభుత్వానికి సహకరిస్తుందని అని ఆయన చెప్పారు.


Updated Date - 2020-07-14T02:28:27+05:30 IST