బాలబాలాజీ పెళ్లికొడుకాయెనే!

ABN , First Publish Date - 2021-06-21T06:32:09+05:30 IST

అప్పనపల్లి బాలబాలాజీ స్వామి ఆదివారం పెళ్లి కొడుకయ్యారు. శ్రీదేవి, భూదేవిలతో సోమవారం రాత్రి 9.01 గంటలకు కల్యాణం నిర్వహించ నున్నారు.

బాలబాలాజీ పెళ్లికొడుకాయెనే!

నేటి రాత్రి 9.01 గంటలకు స్వామివారి కల్యాణం
మామిడికుదురు, జూన్‌ 20: అప్పనపల్లి బాలబాలాజీ స్వామి ఆదివారం పెళ్లి కొడుకయ్యారు. శ్రీదేవి, భూదేవిలతో సోమవారం రాత్రి 9.01 గంటలకు కల్యాణం నిర్వహించ నున్నారు. కొవిడ్‌ ప్రభావంతో ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలుపుదల చేసిన కారణంగా ప్రభుత్వ నిబంధనలకు లోబడి  కల్యాణాన్ని పరిమిత భక్తుల సమక్షంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు సహాయ కమిషనరు పి.బాబూరావు, ధర్మకర్తల మండలి చైర్మన్‌ పిచ్చిక చిన్నా తెలిపారు. కల్యా ణోత్సవంలో పరోక్షంగా పాల్గొనే భక్తులు దేవస్థానానికి చెందిన 94910 00720 నెంబరును సంప్రదించాలని సూచించారు. కల్యాణ మహోత్సవాన్ని యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని, భక్తులు చూసి తరించాలని సూచించారు. కల్యాణోత్సవంలో భాగంగా ఆదివారం స్వామివారితో పాటు ఉభయ దేవేరులను కల్యాణానికి అర్చకస్వాములు సిద్ధం చేశారు.  


Updated Date - 2021-06-21T06:32:09+05:30 IST