Abn logo
Sep 19 2021 @ 00:57AM

వాడపల్లి వెంకన్న ఆదాయం రూ.7.05 లక్షలు

ఆత్రేయపురం, సెప్టెంబరు 18: వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రంలో శనివారం ఉభయ రాష్ట్రాలనుంచి వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ సేవల ద్వారా స్వామివారికి ఒక్కరోజు ఆదా యం రూ.7,05,334 లభించినట్టు ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. పి.గన్నవరం శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. నిత్యాన్నదాన ట్రస్టుకు ద్రాక్షారామానికి చెందిన సూతాపల్లి వీరబాబు రూ.25వేలు, పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన తంగెళ్ల హరిప్రియాంక రూ.10వేలు విరాళాన్ని  సమర్పించారు. ఆలయ చైర్మన్‌ రమేష్‌రాజు దాతలకు స్వామివారి చిత్రపటం, తీర్థ,ప్రసాదాలు అందజేశారు.