వైభవంగా గోదాదేవి కల్యాణం

ABN , First Publish Date - 2022-01-15T06:08:34+05:30 IST

ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం భోగి పండగ సందర్భంగా గోదాదేవి, రంగనాథుల కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ప్రధానార్చకులు ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ఈ వేడుకను శాస్త్రోక్తంగా జరిపారు.

వైభవంగా గోదాదేవి కల్యాణం
ఉపమాక ఆలయంలో గోదాదేవి కల్యాణం జరుపుతున్న అర్చకులు

 ఉపమాకలో నేత్రపర్వంగా వేడుక

  పోటెత్తిన భక్తజనం

నక్కపల్లి/ఎస్‌.రాయవరం, జనవరి 14 : ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం భోగి పండగ సందర్భంగా గోదాదేవి, రంగనాథుల కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ప్రధానార్చకులు ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ఈ వేడుకను శాస్త్రోక్తంగా జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు తిలకించారు.  ఇదిలావుంటే, దేవవరానికి చెందిన ఆచంట రామకృష్ణ దంపతులు స్వామివారికి అలంకరణ నిమిత్తం వెండి వరద హస్తం, కటి హస్తములను సమర్పించారు. అలాగే, ఎస్‌.రాయవరంలోని వేంకటేశ్వర ఆలయంలో స్వామి కల్యాణాన్ని జరిపించారు. 

పాయకరావుపేట : పట్టణంలోని  పలు ఆలయాల్లో   గోదాదేవి కల్యాణాన్ని కన్నుల పండువగా జరిపారు. రాధారుక్మిణీ సమేత పాండురంగ  ఆలయంలో  ఈ వేడుకను మరింత ఘనంగా నిర్వహించారు. దేవస్థానం మాజీ చైర్మన్‌, వైసీపీ మండల అధ్యక్షుడు ధనిశెట్టి బాబూరావు, మాజీ సర్పంచ్‌ ధనిశెట్టి నాగమణి, నారపురెడ్డి పద్మావతి, గొల్లపూడి వీరభద్రరావు, చిక్కాల శ్రీనివాసరావు, జి.రామచంద్రరావు దంపతులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-15T06:08:34+05:30 IST