హతవిధీ.. ఇదా నది!

ABN , First Publish Date - 2021-02-21T05:08:24+05:30 IST

జీవనది గోదావరి గరళాన్ని మింగుతోంది. భద్రాచలం పట్టణంలో నుంచి వెలువడుతున్న వ్యర్థాలు, మలినాలు నేరుగా గోదావరిలో కలుస్తున్నాయి.

హతవిధీ.. ఇదా నది!
భద్రాచలంలోని అశోకనగర్‌ కొత్తకాలనీ సమీపంలో గోదావరిలో కలుస్తున్న మురుగునీరు

వ్యర్థాలతో కలుషితమవుతున్న గోదావరి

కాలుష్య కారకాల నుంచి మోక్షం ఎప్పుడు

శాశ్వత పరిష్కారంపై చిత్తశుద్ధి కరవు

అటకెక్కిన జల కాలుష్య నివారణ పథకం

భద్రాచలం, ఫిబ్రవరి 20: జీవనది గోదావరి గరళాన్ని మింగుతోంది. భద్రాచలం పట్టణంలో నుంచి వెలువడుతున్న వ్యర్థాలు, మలినాలు నేరుగా గోదావరిలో కలుస్తున్నాయి. నదీ పరివాహాక ప్రాంతంలో పరిశ్రమలు, పట్టణాలు, గ్రామాల నుంచి వస్తున్న వ్యర్థా లు, మలినాలు పూర్తిస్థాయిలో శుద్ధి చేయకపోవడంతో గోదావరి నది తన పవిత్రతను కోల్పోతోంది. ఇప్పటికే ఈ నదీ జలాలలో స్నానం చేసేవారితో పాటు, తాగునీటికి ఉపయోగించడం వల్ల వివిధ రకాల వ్యాధులు, రోగాలు వస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. భద్రాచలం పట్టణంలో విస్తా కాంప్లెక్సు నుంచి వెలువడుతున్న వ్యర్థాలు ఇటీవల వరకు గోదావరిలో స్నాన ఘట్టాల వద్దే కలిసేవి. అయితే మళ్లీ వాటిని గోదావరి కింది భాగంలో అఽధికారులే వదిలేలా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా మిషన్‌ భగీరథ ద్వారా సరఫరా చేస్తున్న తాగునీటి ఇన్‌టేక్‌వెల్‌కు పైభాగంలో ఉన్న గోదావరిలోకి సైతం పట్టణంలోని వ్యర్థాలతో కూడిన నీటిని వదులుతున్నారు. ఈ విధంగా కొన్ని దశాబ్దాలుగా అధికారులే గోదావరిని కలుషితం చేస్తున్నారు. ఒక వైపు నదులను పవిత్రంగా ఉంచాలని ప్రచారం చేసే అధికార యంత్రాంగం, మరో వైపు బహిరంగంగా గోదావరిని కలుషితం చేస్తుండటం ఎంత వరకు సమంజసమని ఈ ప్రాంత వాసులు ప్రశ్నిస్తున్నా రు. పరిశ్రమల నుంచి వస్తున్న వ్యర్థాలను సైతం నదిలో పూర్తిస్థాయిలో శుద్ధి చేయకుండా కలుపుతుండటంతో ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయి. కేంద్రం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న గోదావరి జల కాలుష్య నివారణ పథకం మూలనపడింది. క నీసం ఒక్క ఏడాది పాటు కూడా నీటిని శుద్ధి చేసిన దాఖలాలు లేవు. 

జల కాలుష్య నివారణ పథకానికి మోక్షమెన్నడు!

జీవనదిలో కాలుష్యాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. మూడు కోట్లతో భద్రాచలంలో గోదావరి జల కాలుష్య నివారణ పథకాన్ని నిర్మించింది. కాని దాని ఆలనా పా లన విస్మరించడంతో జల కాలుష్య నివారణ పథకం మూలన పడింది. గోదావరి నదీ పరివాహాక ప్రాంతంలో ఉన్న ఉమ్మడి రాష్ట్రంలోని మంచిర్యాల, రామగుండం, భద్రాచ లం, రాజమండ్రిల్లో ఆ నాడు రూ.34.19 కోట్లను వెచ్చించి ఈ పథకాన్ని ఏర్పాటు చేశా రు. పథకాన్ని 2001లో చేపట్టి 2004లో పూర్తి చేశారు. 2005 వరకు ఈ పథకం నిర్వహణ బాధ్యతలు కాంట్రాక్టరే నిర్వహించగా, అనంతరం ఈ పథకం నిర్వహణ అటకెక్కింది. పథకం నిర్వహణకు ఏటా రూ.60 లక్షలు వరకు కావాల్సి ఉంటుందని అధికారు లు చేతులెత్తేశారు. ప్రస్తుతం పథకం నిర్వహణ సక్రమంగా లేకపోగా ఆనాడు కొనుగో లు చేసిన జనరేటర్‌ తుప్పు పట్టింది. పథకం మూలనపడటంతో భద్రాచలంలో ము రుగునీరు నేరుగా గోదావరిలో కలవడం వల్ల కాలుష్య సమస్య ఎదురవుతోందని, ఇప్పటికే తాము ప్రభుత్వం దృష్టికి తెచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే ప్రభు త్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో గోదావరి మరింతగా కాలుష్య కోరల్లో చిక్కుకుంటోంది. కాలుష్య నివారణ పథకానికి మోక్షం వస్తేనే గోదావరి బాగుప డుతుందని, లేదంటే తన సహజ సిద్ధ రూపాన్ని కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని పర్యావరణ వేత్తలు వాపోతున్నారు. పట్టణంలో రెండు తూముల ద్వారా గోదావరిలోకి వ్యర్థాలను నేరుగా వదలకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Read more