గోదావరికి జలకళ

ABN , First Publish Date - 2021-06-20T18:21:43+05:30 IST

నిన్నటిదాకా రాళ్లు రప్పలతో, ఇసుక తిన్నెలతో ఎడారిని తలపించిన గోదావరి నది నేడు కొత్త నీరుతో జలకళ సంతరించుకుంది.

గోదావరికి జలకళ

భద్రాచలం: నిన్నటిదాకా రాళ్లు రప్పలతో, ఇసుక తిన్నెలతో ఎడారిని తలపించిన గోదావరి నది నేడు కొత్త నీరుతో జలకళ సంతరించుకుంది. మొన్నటివరకు గోదావరిలో నీరు కనిష్ట స్థాయి కంటే దిగువకు పడిపోయింది. నేడు కొత్త నీటి ఓరవడితో ఉరకలేస్తుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. క్రమక్రమంగా భద్రాచలంలో గోదావరి నది వద్ద నీటిమట్టం పెరుగుతుంది.  ఇసుకలో వేసిన పాకలు కూడా మునిగిపోవడంతో అక్కడి వ్యాపారులు ప్రస్తుతం స్నాన ఘట్టాల వద్ద తమ వ్యాపారాలను సాగిస్తున్నారు. ఇప్పటికే భద్రాచలంతో పాటు ముంపు మండలాల ప్రజలను లోతట్టు ప్రాంతాల నుండి కాపాడడానికి జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Updated Date - 2021-06-20T18:21:43+05:30 IST