ఉప్పొంగిన గోదావరి

ABN , First Publish Date - 2021-09-30T00:06:08+05:30 IST

గోదావరి నదికి వరద పోటెత్తడంతో పరివాహక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద ఉధృతిని దృష్టిలో ఉంచుకుని అధికారులు

ఉప్పొంగిన గోదావరి

మంచిర్యాల: గోదావరి నదికి వరద పోటెత్తడంతో పరివాహక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద ఉధృతిని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్టు 40 గేట్లు నాలుగు మీటర్ల మేర ఎత్తి 6,58, 983 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో పరివాహక ప్రాంతాల్లోని పంట పొలాలు నీట మునిగాయి. నస్పూర్‌ మండలంలో సుమారు 100 ఎకరాల్లో వరిపంట నీట మునిగింది. కోటపల్లి మండలంలో 392 ఎకరాల మిర్చి, 27 ఎకరాల పత్తి చేనులో నీరు నిలిచింది. చెన్నూరు మండలంలో పలు గ్రామాల్లో సుమారు 1000 ఎకరాల పంట దెబ్బతిన్నది. సుమారు 648 ఎకరాల పత్తి, 282 ఎకరాల వరితోపాటు 70 ఎకరాల్లో పండ్ల తోటలు నీట మునిగాయి.  అలాగే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ నగర్‌, ఎల్‌ఐసీ కాలనీల్లో సుమారు 30 ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో అధికారులు ఆయా ప్రాంతాల వారికి మరోచోట పునరావాసం కల్పించారు. 15 రోజుల వ్యవధిలో రాళ్లవాగు ఉప్పొంగి మూడు సార్లు ఇళ్లలోకి నీరు చేరినట్లు బాధితులు తెలిపారు. 

Updated Date - 2021-09-30T00:06:08+05:30 IST