Godavari flood: గోదావరికి మళ్లీ వరద

ABN , First Publish Date - 2022-08-11T11:56:56+05:30 IST

గోదావరి (Godavari) మళ్లీ పోటెత్తింది. ఎగువ నుంచి వరద ఉధృతి భారీగా పెరుగుతోంది. బుధవారం ఉదయం 5 గంటలకు భద్రాచలం

Godavari flood: గోదావరికి మళ్లీ వరద

అమరావతి: గోదావరి (Godavari) మళ్లీ పోటెత్తింది. ఎగువ నుంచి వరద ఉధృతి భారీగా పెరుగుతోంది. బుధవారం ఉదయం 5 గంటలకు భద్రాచలం వద్ద 45.3 అడుగుల నీటి మట్టం నమోదైంది. సాయంత్రం 4 గంటలకు 50.5 అడుగులకు చేరుకున్నది. తెలంగాణ (Telangana) అధికారులు మాత్రం 55 అడుగుల వరకు గోదావరి నీటి మట్టం చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వరద కారణంగా ఇప్పటికే ఏలూరు జిల్లా (Eluru District) కుక్కునూరు-దాచారం మధ్య రాకపోకలు నిలిచిపోగా సీతారామనగరం, ముత్యాలమ్మపాడు వెళ్లే రహదారులు కూడా నీట మునిగాయి. వేలేరుపాడు మండలంలో దాదాపు 40 గ్రామాలను వరద చుట్టుముట్టడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. గోదావరి నదికి ఎగువన వరద తక్కువగానే ఉన్నప్పటికీ శబరి, పోలవరం బ్యాక్‌ వాటర్‌ కారణంగా గతం కంటే 8 అడుగుల వరద నీరు అధికంగా వచ్చి చేరింది. పోలవరం ప్రాజెక్టు కాఫర్‌ డ్యామ్‌ ఎగువన గోదావరి నీటిమట్టం 33.370 మీటర్లు, దిగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద 24.760 మీటర్లు నమోదయింది.

Updated Date - 2022-08-11T11:56:56+05:30 IST