సాగుకు గడ్డుకాలమే!

ABN , First Publish Date - 2021-01-20T07:01:32+05:30 IST

(అమలాపురం-ఆంధ్రజ్యోతి) గోదావరిలో నీటి లభ్యత తగ్గుతుండడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దాళ్వా సాగు గట్టెక్కే పరిస్థితులు కష్టమేనన్న సంకేతాలు వెలువడుతు న్నాయి. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల వైపు ఇరిగేషన్‌ అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులకు డెల్టాలోని సాగునీటి నిర్వ

సాగుకు గడ్డుకాలమే!
సాగునీరు అందక రోళ్లపాలెంలో పూర్తికాని దుక్కులు

గోదావరిలో తగ్గుతున్న నీటి నిల్వలు

కాలువల్లో అడుగంటిన సాగునీరు

అమలాపురం కెనాల్‌కు అదనంగా వంద క్యూసెక్కుల నీరు 

ఇక నారుమడులు వద్దు.. ఆలోచించి నాట్లు వేయండి

ఇరిగేషన్‌ అధికారుల సూచన


(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

గోదావరిలో నీటి లభ్యత తగ్గుతుండడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దాళ్వా సాగు గట్టెక్కే పరిస్థితులు కష్టమేనన్న సంకేతాలు వెలువడుతు న్నాయి. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల వైపు ఇరిగేషన్‌ అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులకు డెల్టాలోని సాగునీటి నిర్వహణలో అవగాహన లేమి కారణంతో దాళ్వా సాగుచేసే రైతాంగం అప్పుడే అష్టకష్టాలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. సెంట్రల్‌ డెల్టా పరిధి లోని వివిధ శివారు ప్రాంతాల్లో ఏర్పడిన సాగునీటి ఎద్దడితో వందలాది ఎకరాల భూములు నీటి కోసం ఎదురుచూస్తున్నాయి. కాలువల్లో చుక్కనీరు లేక ఎండిపోయాయి. నిర్ణీత సమయం కంటే నాట్లు వేయడంలో నెలకొన్న జాప్యం వల్ల ఈసారి కోనసీమ పరిధిలోని వందలాది ఎకరాల్లో దాళ్వా పంట సాగులో ఆది నుంచి చివరి వరకు ఏర్పడే పరిస్థితులపై రైతుల్లో అప్పుడే ఆందోళన మొదలైంది. రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ ప్రాతినిధ్యం వహించే అమలాపురం నియోజకర్గ పరిధిలోని అమలాపురం రూరల్‌, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాలతోపాటు ముమ్మి డివరం, ఐ.పోలవరం, పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గంలోని శివారు ప్రాంత పంట పొలాలకు సాగునీరు అందడంలేదు. దాంతో వందల ఎకరా ల్లో దుక్కులు లేక పంట భూములు బీడులుగా దర్శనమిస్తున్నాయి. నారు మడులు ఇప్పటికే ఏపుగా ఎదిగిపోవడంతో, వాటిలో కూడా నీరు లేక బీటలు వారుతున్న పరిస్థితులు అమలాపురం రూరల్‌ మండలం చిందాడ గరువు, రోళ్లపాలెం తదితర గ్రామాల్లో నెలకొంది. సాగునీటి తీవ్రతపై ఆంధ్రజ్యోతిలో వచ్చిన ‘నారున్నా.. నీరేదీ’ శీర్షికన ప్రచురితమైన వార్తా కథనంపై జిల్లా కలెక్టర్‌ ఇరిగేషన్‌శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోను మార్చి 31కే కాలువలు కట్టివేయనున్న దృష్ట్యా ఇకపై నాట్లు వేయకుండా రైతులను చైతన్యవంతుల్ని చేయాల్సిందిగా ఇరిగేషన్‌, వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. ఫిబ్రవరి 15కే మంచినీటి చెరువుల్లో నీటి నిల్వలు నింపే దిశగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశిం చారంటే నీటి ఎద్దటి ఈసారి దాళ్వాపై ఏవిధమైన ప్రభావం చూపుతుంద నేది అర్థం చేసుకోవచ్చు. రూ.4.43 కోట్ల వ్యయంతో 37 చోట్ల క్రాస్‌బండ్‌లు వేసేందుకు జిల్లా ఇరిగేషన్‌ ఎడ్వైజరీ బోర్డు నిర్ణయించింది. ఇప్పటికీ పూర్తిగా నాట్లు వేయలేని పరిస్థితులను చూసి అధికారులు తలలు పట్టుకుంటు న్నారు. ప్రస్తుతం గోదావరిలో 3 వేల క్యూసెక్కుల నీరు ధవళేశ్వరం బ్యారే జీకి సహజసిద్ధంగా వచ్చేది. అయితే గోదావరిపై తెలంగాణ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టుల వల్ల ఆ నీటికి ఈసారి గండి పడింది.


ఇక భవిష్యత్తు అంతా సీలేరు నది నీటిపైనే ఆధారపడి గోదావరి జిల్లాల్లో దాళ్వా సాగు సేద్యం జరగాల్సిన పరిస్థితి. ప్రస్తుతం అమలాపురం కాలువపై సమనస వద్ద 7 అడుగుల నీటిమట్టం ఉంటే తప్ప పరిసర గ్రామాల్లోని రైతులు దుక్కులు దున్నేందుకు అవకాశం ఉండదని ఇరిగేషన్‌ డీఈ కె.రాంబాబు చెప్పారు. మంగళవారం నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లోని భూముల పరిస్థితి ని, కాలువల్లో చుక్క నీరు లేని ప్రాంతాలను పరిశీలించి పరిస్థితిని ఉన్న తాధికారులకు నివేదించారు.రైతాంగం నీటి ఎద్దడి కారణంగా ఎదుర్కొం టున్న సమస్యలపై టీడీపీ పార్లమెంటరీ కమిటీ రైతు సంఘ అధ్యక్షుడు మట్టా మహలక్ష్మిప్రభాకర్‌తోపాటు అనేకమంది రైతులు డీఈ ముందు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ఉన్నతాధికారులు ఇక్కడి రైతుల పరిస్థితు లను అర్థం చేసుకుని వంద క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారని, ఈ నీటిని అమలాపురం కెనాల్‌ ద్వారా నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు సరఫరా చేసేందుకు ఇరిగేషన్‌శాఖ అధికారులు నిర్ణయించారు. దుక్కులు దున్నే నాటికే ఈ పరిస్థితి ఉంటే రేపు ఈనిక దశ నాటికి నీటి ఎద్దడి ఏ స్థాయిలో ఉంటుందో రైతులు అర్థం చేసుకుని నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇక కొత్తగా నారుమడులు వేసేందుకు రైతులు ఎటువంటి ప్రయత్నాలు చేయవద్దని ఇరిగేషన్‌, వ్యవసాయశాఖ అధికారులతోపాటు రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.

Updated Date - 2021-01-20T07:01:32+05:30 IST