క్షేమ దేవత పైడితల్లి!

ABN , First Publish Date - 2021-10-23T05:30:00+05:30 IST

విజయదశమి తరువాత వచ్చేదే పైడితల్లి అమ్మవారి పండుగ. పూసపాటి వంశంలో జన్మించిన పైడితల్లి అల్లారు ముద్దుగా పెరిగింది...

క్షేమ దేవత పైడితల్లి!

విజయదశమి తరువాత వచ్చేదే పైడితల్లి అమ్మవారి పండుగ. పూసపాటి వంశంలో జన్మించిన పైడితల్లి అల్లారు ముద్దుగా పెరిగింది. పైడి అంటే బంగారం అని అర్థం. పైడితల్లి అన్న రామరాజు ఆమెను ఒక్కక్షణం కూడా విడిచి ఉండే వాడు కాదు. పైడితల్లికి దుర్గమ్మ అంటే ఎనలేని భక్తి. ఆ సమయంలో విజయనగర రాజులకు, బొబ్బిలి రాజవంశీయులతో యుద్ధం జరుగుతోంది. అప్పటికే ఎంతో మంది అసువులు బాసారు. యుద్ధం వద్దని పైడితల్లి ఎంత చెప్పి ఆమె అన్న రామరాజు వినలేదు. తన ప్రయత్నం విఫలం కావడంతో తట్టుకోలేక విజయనగరం రాజప్రసాదం వెనక ఉన్న పెద్ద చెరువులోకి దూకి ప్రాణత్యాగం చేసింది. తరువాత బంధువుల కలలో కనిపించి తన ఉనికి గురించి వివరించింది పైడితల్లి. అదేమిటంటే తనను చెరువులో నుంచి తీసి గట్టుపైనే గుడి కట్టించమని చెప్పింది. బంధువులు చెరువులో వెతికితే బంగారు బొమ్మగా దొరికింది. పైడితల్లి క్షేమ దేవతగా అవతరించింది. 1758 నుంచి పైడితల్లి ఉత్సవాలు జరుగుతున్నాయి. పైడితల్లి ఉత్సవాల్లో ప్రధానఘట్టం ‘సిరిమానోత్సవం’. సిరిమానును చింతచెట్టు కలపతో తయారుచేస్తారు. పైడితల్లికి ప్రతీకగా ప్రధానపూజారి సిరిమానును అధిష్ఠిస్తారు. 




బత్తిన గ్రీష్మ

6వ తరగతి ఫోర్ట్‌ సిటీ స్కూల్‌, విజయనగరం

Updated Date - 2021-10-23T05:30:00+05:30 IST