Advertisement
Advertisement
Abn logo
Advertisement

అంత్యక్రియలకు వెళ్తూ అనంత లోకాలకు

  • టైరు పగిలి.. మినీ వ్యాన్‌ను ఢీకొన్న కారు
  • లింగాలఘణపురంలో తల్లి-తండ్రి-కుమారుడి దుర్మరణం

జనగామ, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): బంధువు అంత్యక్రియలకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు సహా.. కుమారుడు అనంతలోకాలకు చేరుకున్న ఉదంతం ఇది. ఈ ఘటన జనగామ జిల్లా లింగాల ఘణపురం వనపర్తి స్టేజి వద్ద శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని చందానగర్‌ డివిజన్‌ పాపిరెడ్డికాలనీకి చెందిన జిన్న శేఖర్‌రెడ్డి(65) మేనబావ, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలానికి చెందిన సంకపల్లి నర్సిరెడ్డి మృతిచెందడంతో.. అంత్యక్రియలకు తన మొదటి భార్య ధనలక్ష్మి(60), కుమారుడు రఘుమారెడ్డి(27)తో కలిసి శుక్రవారం ఉదయం కారులో బయలుదేరారు. ఘట్‌కేసర్‌, భువనగిరి, జనగామ మీదుగా తిరుమలగిరికి వెళ్తుండగా.. లింగాలఘణపురం వనపర్తి స్టేజి వద్దకు రాగానే.. కారు కుడివైపు ముందు టైర్‌ పగిలిపోయింది. దీంతో వాహనం అదుపుతప్పి.. ఎదురుగా గేదెలతో వస్తున్న బొలేరో మినీ వ్యాన్‌ను ఢీకొంది. ఈ ఘటనలో రెండు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. శేఖర్‌రెడ్డి, ధనలక్ష్మి, రఘుమారెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. మినీ వ్యాన్‌ డ్రైవర్‌ కాటేపల్లి రమేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కాగా, రఘుమారెడ్డికి ఏడాది క్రితమే వివాహమైంది.

Advertisement
Advertisement