గోక్షురాది గుగ్గిలం

ABN , First Publish Date - 2021-04-13T06:35:52+05:30 IST

ఆయుర్వేద వైద్యంలో మూత్ర సంబంధ వ్యాధులకు విశేషంగా ఉపయోగంలో ఉన్న ఔషధాలలో గోక్షురాది గుగ్గిలం ముఖ్యమైనది. ఈ ఔషధం తయారీ, ఉపయోగాలు గురించి ఆయుర్వేద శాస్త్ర గ్రంథమైన శ్రీ శారజ్ఞధర సంహితలో వివరంగా ఉంది

గోక్షురాది గుగ్గిలం

ఆయుర్వేద వైద్యంలో మూత్ర సంబంధ వ్యాధులకు విశేషంగా ఉపయోగంలో ఉన్న ఔషధాలలో గోక్షురాది గుగ్గిలం ముఖ్యమైనది. ఈ ఔషధం తయారీ, ఉపయోగాలు గురించి ఆయుర్వేద శాస్త్ర గ్రంథమైన శ్రీ శారజ్ఞధర సంహితలో వివరంగా ఉంది. సంస్కృతంలో గోక్షుర అంటే పల్లేరు. దీని కాయలు ముళ్లతో ఉంటాయి. వీటిని ఔషధాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. గోక్షురాది గుగ్గులను పల్లేరు కాయలను కషాయంగా కాచి దానిలో శుద్ధి చేసిన గుగ్గిలం, త్రికటు, కరక్కాయ, ఉసికర, తుంగముస్తలు వంటి మూలకాలు కలిపి తయారు చేస్తారు. 


ప్రమేహములు, మూత్రకుచ్ఛములు, స్త్రీల ప్రదర రోగాలు, మూత్ర ఝూతాలు, వాతరక్తం, వాత రోగాలు, శుక్రకణ దోషాలు, అశ్మరీ వంటి రోగాల చికిత్సలో గోక్షురాది గుగ్గులు ఉపయోగిస్తారు. కిడ్నీ సంబంధ రోగాల్లో డయాలసిస్‌ చేస్తున్న వారికి గోక్షురాది గుగ్గులతో పునర్నవా కలిపి తీసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుందని మా అనుభవంలో తెలిసింది.


ఉపయోగించే మోతాదు: పెద్దలు రెండు మాత్రలు, పిల్లలు ఒక మాత్ర నీటితో తీసుకోవాలి. వైద్యుల సూచన ప్రకారం ఈ మాత్రలు వేసుకోవాలి. ప్రస్తుతం ఈ మందును దూత్‌ పాపేశ్వర్‌, బైద్యనాథ్‌, జండూ వంటి ఆయుర్వేద సంస్థలు తయారు చేస్తున్నాయి. 

జి.శశిధర్‌ అనువంశిక ఆయుర్వేద వైద్య నిపుణులు సనాతన జీవన్‌ ట్రస్ట్‌ కొత్తపేట, చీరాల-523157, ఫోన్‌ నం.08594237666

Updated Date - 2021-04-13T06:35:52+05:30 IST