జూన్‌ 1 నుంచి గోల్డ్‌ హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి

ABN , First Publish Date - 2021-04-14T06:23:43+05:30 IST

బంగారం హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి నిబంధనలను జూన్‌ 1 నుంచి అమలులోకి తేనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. బంగారం స్వచ్ఛతకు ధ్రువీకరణే హాల్‌మార్కింగ్‌. ప్రస్తుతానికి ఇది ఐచ్ఛికం

జూన్‌ 1 నుంచి గోల్డ్‌ హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి

న్యూఢిల్లీ: బంగారం హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి నిబంధనలను జూన్‌ 1 నుంచి అమలులోకి తేనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. బంగారం స్వచ్ఛతకు ధ్రువీకరణే హాల్‌మార్కింగ్‌. ప్రస్తుతానికి ఇది ఐచ్ఛికం. ఇప్పటికే బడా ఆభరణ వర్తకులు హాల్‌మార్కింగ్‌ నగలనే విక్రయిస్తున్నారు. ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేయనున్నట్లు 2019 నవంబరులో ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు, ఆభరణ వర్తకులు బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిందిగా కోరింది. ఇందుకోసం 2021 జనవరి 15 వరకు గడువు ఇచ్చింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో గడువును జూన్‌ 1 వరకు పొడిగించింది. ఇప్పటివరకు 34,647 మంది ఆభరణ వర్తకులు తమ వద్ద వివరాలు నమోదు చేసుకున్నట్లు బీఐఎస్‌ డైరెక్టర్‌ జనరల్‌ ప్రమోద్‌ కుమార్‌ తివారీ తెలిపారు. వచ్చే రెండు నెలల్లో లక్ష మంది రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చన్నారు.  హాల్‌మార్కింగ్‌ నిబంధనలు అమల్లోకి వచ్చాక జువెలర్లు కేవలం 14, 18, 22 క్యారెట్ల స్వచ్ఛత స్వర్ణాభరణాలను విక్రయించడానికి మాత్రమే వీలుంటుంది. 

Updated Date - 2021-04-14T06:23:43+05:30 IST