బంగారం దిగుమతుల జోరు

ABN , First Publish Date - 2021-05-17T06:24:40+05:30 IST

దేశంలో బంగారానికి డిమాండ్‌ పెరగడంతో ఏప్రిల్‌ నెలలో 630 కోట్ల డాలర్ల విలువ గల పసిడి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఇదే నెలలో వెండి దిగుమతులు మాత్రం 88.53 శాతం క్షీణించి 1.19 కోట్ల డాలర్లకు..

బంగారం దిగుమతుల జోరు

ముంబై: దేశంలో బంగారానికి డిమాండ్‌ పెరగడంతో ఏప్రిల్‌ నెలలో 630 కోట్ల డాలర్ల విలువ గల పసిడి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఇదే నెలలో వెండి దిగుమతులు మాత్రం 88.53 శాతం క్షీణించి 1.19 కోట్ల డాలర్లకు పడిపోయాయి. గత ఏడాది ఏప్రిల్‌లో బంగారం దిగుమతుల విలువ కేవలం 283 కోట్ల డాలర్లుగా ఉంది.  బంగారం దిగుమతులు పెరిగిన ప్రభావం వల్ల వాణిజ్య లోటు కూడా 1,510 కోట్ల డాలర్లకు పెరిగింది. ఈ ఏడాది తొలిసారిగా నమోదైన వాణిజ్యలోటు ఇదే. గత ఏడాది ఏప్రిల్‌ వాణిజ్య లోటు 676 కోట్ల డాలర్లుంది. ప్రస్తుతం దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా రెండో దశ ప్రభావం వల్ల రాబోయే నెలల్లో డిమాండ్‌ తగ్గవచ్చని పరిశ్రమ నిపుణులంటున్నారు.


Updated Date - 2021-05-17T06:24:40+05:30 IST