పీవీకేకే విద్యార్థినికి ‘తైక్వాండో’లో స్వర్ణం

ABN , First Publish Date - 2021-10-25T06:26:55+05:30 IST

జాతీయ స్థాయి తై క్వాండో పోటీలలో పీవీకేకే ఐటీ కళాశాల విద్యార్థిని జీ కనక వర్ష బంగారు పతకం సాధించిం ది.

పీవీకేకే విద్యార్థినికి ‘తైక్వాండో’లో  స్వర్ణం
విద్యార్థినిని అభినందిస్తున్న చైర్మన పల్లె కిశోర్‌

 అనంతపురం రూరల్‌, అక్టోబరు24: జాతీయ స్థాయి తై క్వాండో పోటీలలో పీవీకేకే ఐటీ కళాశాల విద్యార్థిని జీ కనక వర్ష బంగారు పతకం సాధించిం ది. ఈ సందర్భంగా విద్యార్థినిని విద్యాసంస్థల చైర్మన పల్లె కిశోర్‌ తదితరులు ఆదివా రం అభినందించారు. పల్లె కిశోర్‌ మాట్లాడుతూ..ఇటీవల గోవా లోని బీపీఎస్‌ క్రీడా ప్రాంగణంలో.... స్కూల్‌ గేమ్స్‌ డెవలప్‌మెంట్‌ ఫెడరేషన ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నేషనల్‌ స్కూల్‌ గేమ్స్‌ చాంఫియన షిప్‌ (2020-21) పోటీలసు నిర్వహించారన్నారు. ఈ పోటీల్లో రాష్ట్రం తరుపున కళాశాలకు చెందిన కనక వర్ష 60కేజీల విభాగంలో బంగారు పతకం సాధించిందన్నారు. ఆమెకు కళాశా ల తరుపున రూ.10వేలు చెక్కును అందజేశారు. కార్యక్రమంలో డైరెక్టర్‌ సింధూర రెడ్డి, స్పెషల్‌ ఆఫీసర్‌ శ్రీనివాసలురెడ్డి, యాజమాన్యప్రతినిధి శ్రీకాంతరెడ్డి, ప్రిన్సిపాల్‌ బండి రమేష్‌బాబు, ఎలకి్ట్రకల్‌ ఇంజనీరింగ్‌ విభాగాధిపతి మహేశ పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-25T06:26:55+05:30 IST