Advertisement
Advertisement
Abn logo
Advertisement

26.5 కాసుల బంగారం ఎత్తుకెళ్లారు

పెదపాడు, నవంబరు 28: కొక్కిరపాడులో గుర్తు తెలియని దొంగలు ఇంటి తాళాలు పగులకొట్టి చోరీకి పాల్పడ్డారు. 26.5 కాసుల బంగారు నగ లు, రూ.లక్ష నగదు ఎత్తుకుపోవడం స్థానికంగా కలకలం రేపింది. బాధితు లు, పోలీసుల వివరాల ప్రకారం కొ క్కిరపాడులో నివాసముంటున్న అడు సుమిల్లి సత్యనారాయణ, భార్య,  బం ధువుల ఇంటి వద్ద జరిగే శుభకార్యానికి నాలుగు రోజుల క్రితం వెళ్లారు. సత్యనా రాయణ తిరిగి శనివారం ఇంటికి వచ్చేసరికి తాళాలు పగులకొట్టి ఉన్నాయి. ఇంట్లో చూడగా బీరువాలో 26.5 కాసుల బంగారు నగలు, రూ.లక్ష నగదు మాయమైనట్లు గుర్తించి పెదపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని ఏలూరు రూరల్‌ సీఐ డీవీ స్వామి, ఎస్‌ఐ జ్యోతిబసు పరిశీలించారు. క్లూస్‌ టీం వేలిముద్రలు సేకరించారు. పెదపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. కొంతకాలంగా జాతీయ రహదారి సమీప గ్రామాల్లో దొంగతనాలు ఎక్కువైనట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసు అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.

Advertisement
Advertisement