తగ్దిగిన బంగారం ధరలు...

ABN , First Publish Date - 2021-06-21T22:39:00+05:30 IST

కరోనా విపత్కర పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. పసిడి ధరలకు ఏమాత్రం బ్రేక్ పడటంలేదు. అయితే... ఇటీవలి కాలంలో భారీగా పెరిగిన ధరలు... ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి.

తగ్దిగిన బంగారం ధరలు...

ముంబై : కరోనా విపత్కర పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. పసిడి ధరలకు ఏమాత్రం బ్రేక్ పడటంలేదు. అయితే... ఇటీవలి కాలంలో భారీగా పెరిగిన ధరలు... ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. కాగా... గత వారం నుంచి బంగారం ధర పతనమవుతూ వస్తోంది. బులియన్ మార్కెట్‌ ప్రకారం.. ప్రతిరోజూ బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే.


ఈ క్రమంలో... బంగారం కొనుగోలుదారులు... బులియన్ మార్కెట్ వైపు దృష్టిసారిస్తుంటారు. కాగా... సోమవారం కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. కొన్ని చోట్ల తగ్గితే, మరికొన్నిచోట్ల ధరలు స్థిరంగా ఉన్నాయి. శనివారం 22 క్యారెట్ల తులం బంగారం ధర.. రూ. 46,220 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,220. 

Updated Date - 2021-06-21T22:39:00+05:30 IST