బంగారం ధర పెరిగింది... వెండి ధర తగ్గింది

ABN , First Publish Date - 2021-07-28T19:35:22+05:30 IST

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.

బంగారం ధర పెరిగింది... వెండి ధర తగ్గింది

హైదరాబాద్ : బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. కిందటి సెషన్(మంగళవారం, జూలై 28)లో ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ. 63.00 (0.13 %) పెరిగి రూ. 47,524 వద్ద ట్రేడ్ అయింది. అక్టోబరు గోల్డ్ ఫ్యూచర్స్ రూ. 121 (0.25%) పెరిగి రూ. 47,741 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం భారీగా తగ్గింది. ఏకంగా రూ. 66,000 స్థాయికి పడిపోయింది. సెప్టెంబరు సిల్వర్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో రూ. 1,001(-1.49%) తగ్గి రూ.  66,120.00 వద్ద ట్రేడ్ అయింది.


డిసెంబరు సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1, 160.00(-1.70 %) తగ్గి రూ. 67,053 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో అంతకుముందు 1,800 డాలర్ల దిగువకు పడిపోయిన గోల్డ్ ఫ్యూచర్స్ మళ్లీ పెరిగింది. ఈ రోజు దాదాపు 7 డాలర్ల మేర పెరిగి 1,807 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.206 డాలర్లు పెరిగి 24.858 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. నిన్న ఓ సమయంలో గోల్డ్ ఫ్యూచర్స్ 1792 డాలర్లకు పడిపోయినప్పటికీ, ఈ రోజు మళ్లీ స్వల్పంగా పెరిగింది.


బంగారం ధరలు నిన్న ఇలా ఉన్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ. 46,750, ముంబైలో రూ. 46,660, చెన్నైలో రూ. 45,040 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ. 47,660 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ఔన్స్ 1796 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. 

Updated Date - 2021-07-28T19:35:22+05:30 IST