Abn logo
Oct 18 2020 @ 23:54PM

బంగారం అపహరణ

రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 18: స్థానిక రాజేంద్రనగర్‌కు చెందిన పి.పార్వతి ఇంట్లో దొంగలు పడి బంగారు వస్తువులు అపహరించుకుపోయారు. పార్వతి ఈనెల 17న ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లి సాయంత్రానికి తిరిగి చేరుకుంది. వచ్చేసరికి ఇంటి తాళాలు తీసివున్నాయి, లోపల బీరువాలో పెట్టిన 12గ్రాముల బంగారు వస్తువులు కనిపించలేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు వన్‌టౌన్‌ పోలీసులు తెలిపారు.


Advertisement
Advertisement
Advertisement