ఇన్‌బాక్స్‌ క్లీన్‌ చేద్దాం!

ABN , First Publish Date - 2020-06-20T05:30:00+05:30 IST

రోజూ పదుల సంఖ్యలో మెయిల్స్‌. ఎప్పటికప్పుడు డిలీట్‌ చేయాలని అనుకుంటారు కానీ కుదరదు. తీరా ఇన్‌బాక్స్‌ నిండిపోయాక ఒక్కో మెయిల్‌ను చెక్‌ చేసుకుంటూ డిలీట్‌ చేయడం కష్టమైపోతుంది...

ఇన్‌బాక్స్‌ క్లీన్‌ చేద్దాం!

రోజూ పదుల సంఖ్యలో మెయిల్స్‌. ఎప్పటికప్పుడు డిలీట్‌ చేయాలని అనుకుంటారు కానీ కుదరదు. తీరా ఇన్‌బాక్స్‌ నిండిపోయాక ఒక్కో మెయిల్‌ను చెక్‌ చేసుకుంటూ డిలీట్‌ చేయడం కష్టమైపోతుంది. మరి ఇన్‌బాక్స్‌ను క్లీన్‌ చేసుకొనేదెలా? అంటే ఇదిగో... కొన్ని ఆన్‌లైన్‌ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. వాటి సాయంతో అనవసర మెయిల్స్‌ను తేలిగ్గా తొలగించవచ్చు. అవేమిటంటే... 


ఇన్‌స్టాక్లీన్‌ - ఈమెయిల్‌ క్లీనర్‌ యాప్‌ ద్వారా బల్క్‌ లో ఈమెయిల్స్‌ డిలీట్‌ చేయవచ్చు. బల్క్‌ డిలీట్‌ చేసిన ప్రతిసారి గోల్డ్‌ టోకెన్స్‌ లభిస్తాయి. 


క్లీన్‌ఫాక్స్‌

ఈ యాంటీ స్పామ్‌ టూల్‌ మీ ఈమెయిల్‌ ఇన్‌బాక్స్‌ను స్కాన్‌ చేస్తుంది. అనవసరమైన మెయిల్స్‌ను అన్‌సబ్‌స్క్రయిబ్‌ చేయడానికి సహాయపడుతుంది. న్యూస్‌లెటర్స్‌, స్పామ్‌, ప్రకటనలకు సంబంధించిన మెయిల్స్‌ను డిలీట్‌ చేయడంలో తోడ్పడుతుంది. అంతేకాకుండా వినియోగదారుని డేటాకు పూర్తి రక్షణ కల్పిస్తుంది. యూజర్‌ ప్రైవసీకి ప్రాధాన్యమిస్తుంది. యూరోపియన్‌ యూనియన్‌ చట్టాలకు లోబడి ఈ ఫ్రెంచ్‌ స్టార్టప్‌ పనిచేస్తుంది. మీ మెయిల్‌ అకౌంట్‌ను యాక్సెస్‌ చేయడానికి ‘క్లీన్‌ఫాక్స్‌’కు అనుమతి ఇవ్వగానే ఇన్‌బాక్స్‌ స్కాన్‌ చేయడం ప్రారంభిస్తుంది. ఏ సెండర్‌ దగ్గరి నుంచి వచ్చే మెయిల్స్‌ను ఎక్కువ సార్లు ఓపెన్‌ చేశారో చెక్‌ చేస్తుంది. దాని ఆధారంగా మెయిల్స్‌ సార్టింగ్‌ చేస్తుంది. ఇన్‌బాక్స్‌ను మేనేజ్‌ చేసుకోవడం కూడా చాలా సులభం. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ వినియోగదారులు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని అకౌంట్‌ను క్రియేట్‌ చేసుకోవచ్చు. దీన్ని ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 


క్లీన్‌ ఈమెయిల్‌

గూగుల్‌, యాహూ వంటి సర్వీస్‌ ప్రొవైడర్లు వెరిఫై చేసిన నమ్మకమైన అప్లికేషన్‌ ఇది. అయితే ఈ అప్లికేషన్‌ను ఉపయోగించుకోవడానికి డబ్బులు చెల్లించాలి. అప్లికేషన్‌ ఇన్‌స్టాల్‌ చేసుకున్నాక ‘ఫ్రీ క్లీనప్‌ సెషన్‌’ను ఉపయోగించుకోవచ్చు. ఆ తరువాత ఏడాది సబ్‌స్ర్కిప్షన్‌ ఎంచుకోవాల్సి ఉంటుంది. దీంతో ఇన్‌బాక్స్‌ను స్కాన్‌ చేసి చాలాకాలంగా ఉన్న ఈమెయిల్స్‌ డిలీట్‌ చేయడం సాధ్యపడుతుంది. షాపింగ్‌ సైట్ల నుంచి వచ్చే మెయిల్స్‌, ఎక్కువ స్థలం ఆక్రమిస్తున్న లార్జ్‌మెయిల్స్‌ను గుర్తించడంలో సహాయపడుతుంది. ఒకేసారి ఎక్కువ మెయిల్స్‌ను ట్రాష్‌లోకి పంపించవచ్చు. అన్‌వాంటెడ్‌ మెయిల్స్‌ను అన్‌సబ్‌స్క్రయిబ్‌ చేయవచ్చు. సెండర్స్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టవచ్చు. మీ మెయిల్‌బాక్స్‌లోకి వచ్చే మెయిల్స్‌ను నియమ నిబంధనలు పెట్టుకోవచ్చు. ముఖ్యమైన మెయిల్స్‌ ‘ప్రొటెక్టెడ్‌’ విభాగంలో, ఫ్రెండ్స్‌ అండ్‌ ఫ్యామిలీ’ లిస్ట్‌లు ‘కోవర్కర్‌’ సెక్షన్‌లోకి వెళ్లేలా సెట్‌ చేసుకోవచ్చు.


ఇన్‌స్టాక్లీన్‌ - ఈమెయిల్‌ క్లీనర్‌

ఈ యాప్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఈమెయిల్‌ లిస్ట్‌ను అన్‌సబ్‌స్క్రయిబ్‌ చేసుకోవడానికి, స్పామ్‌ డిలీట్‌ చేయడానికి, ఇన్‌బాక్స్‌ను ఆర్గనైజ్‌ చేసుకోవడానికి ఈ యాప్‌ చక్కగా ఉపకరిస్తుంది. ఇది జీ మెయిల్‌,  యాహూ, అవుట్‌లుక్‌, జోహో, ఐక్లౌడ్‌, మెయిల్‌.కామ్‌ వంటి సర్వీ్‌సలను సపోర్టు చేస్తుంది. ఒకసారి మీ అకౌంట్‌ను యాక్సెస్‌ చేసుకోవడానికి యాప్‌కు పర్మిషన్‌ ఇస్తే, డాష్‌బోర్డుపై ఈమెయిల్స్‌, యాక్టివ్‌ న్యూస్‌లెటర్స్‌ సబ్‌స్ర్కిప్షన్స్‌ సంఖ్య కనిపిస్తుంది. సెండర్స్‌ లేదా లేబుల్స్‌, సైజును బట్టి మెయిల్స్‌ను బల్క్‌గా డిలీట్‌ చేసుకోవచ్చు. డేట్‌ ఫిక్స్‌ చేసి, ఆ పీరియడ్‌లో వచ్చిన మెయిల్స్‌ను బ్రౌజ్‌ చేసి బల్క్‌గా డిలీట్‌ చేయవచ్చు. అలాంటి టోకెన్స్‌ 80 అవగానే యాప్‌ను ఉపయోగించమని స్నేహితులను ఆహ్వానించవచ్చు. 


Updated Date - 2020-06-20T05:30:00+05:30 IST