Abn logo
Sep 23 2021 @ 23:43PM

చందన స్వామికి స్వర్ణ పుష్పార్చన

స్వర్ణ పుష్పాలతో పూజలందుకున్న ఉత్సవమూర్తి గోవిందరాజస్వామి

సింహాచలం, సెప్టెంబరు 23: సింహగిరి చందన స్వామికి భక్తిశ్రద్ధలతో స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. ఆర్జిత సేవల్లో భాగంగా గురువారం ఉదయం ప్రభాత ఆరాధనల తర్వాత ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని శ్రీదేవి, భూదేవి సమేతంగా కళ్యాణ మండపంలో ఉంచారు. పూజల్లో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో అర్చకులు సంకల్పం చెప్పి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలు చేసి షోడశోపచారాలు సమర్పించారు. నృసింహ అష్టోత్తర శతనామావళిని పఠిస్తూ స్వర్ణ సంపెంగలతో పూజ చేశారు. అనంతరం ఇదే వేదికపై స్వామివారి నిత్య కళ్యా ణాన్ని నిర్వహించగా, 20 జంటలు పాల్గొన్నాయి. ఆర్జిత సేవల్లో పాల్గొన్న భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు. కాగా అప్పన్న స్వామిని టీటీడీ పాలకమండలి సభ్యుడు బి.లక్ష్మీనారాయణ దర్శించుకున్నారు.