త్వరలోనే కొవిడ్‌ ఆస్పతిగా గోల్కొండ

ABN , First Publish Date - 2021-05-09T04:41:28+05:30 IST

రాష్ట్రంలో పెరుగుతున్న కొవిడ్‌ కేసులను దృష్టిలో ఉంచుకొని నగరంలోని గోల్కొండ ఏరియా ఆస్పత్రిని కొవిడ్‌ ఆస్పత్రిగా మార్చనున్నారు.

త్వరలోనే కొవిడ్‌ ఆస్పతిగా గోల్కొండ

 ఆస్పత్రిని తనిఖీ చేసిన సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

మెహిదీపట్నం,  మే 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెరుగుతున్న కొవిడ్‌ కేసులను దృష్టిలో ఉంచుకొని నగరంలోని గోల్కొండ ఏరియా ఆస్పత్రిని కొవిడ్‌ ఆస్పత్రిగా మార్చనున్నారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న వ్యాక్సిన్‌ కేంద్రాలను ఆయన పరిశీలించారు. రెండో డోస్‌ వ్యాక్సిన్‌ కోసం వచ్చిన వారిని అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి నిర్వహణపై వైద్యులను ఆరా తీశారు. 250 పడకలతో  కొవిడ్‌ ఆస్పత్రిగా తీర్చిదిద్దాలని వైద్యశాఖ కార్యదర్శి రాజీవ్‌ని ఆదేశించారు. ఇందులో 100 పడకలతో ఆక్సిజన్‌ వార్డును మరో 150 పడకలతో కొవిడ్‌ సవరణ వార్డును ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభిస్తామని, ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి వార్డును తయారు చేస్తామని ఆస్పత్రి కార్యనిర్వహణ అధికారి గోపాల్‌ తెలిపారు. కార్యక్రమంలోఆరోగ్యశాఖ కమిషనర్‌, గోల్కొండ పోలీ్‌సస్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్‌ఎంవో జ్యోతి, డాక్టర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-09T04:41:28+05:30 IST