Abn logo

గోంగూర చికెన్‌

కావలసినవి: చికెన్‌ - అరకిలో, గోంగూర - రెండు కట్టలు, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - నాలుగు, టొమాటో - ఒకటి, అల్లం - చిన్నముక్క, వెల్లుల్లి రెబ్బలు - ఆరు, పసుపు - అర టీస్పూన్‌, గరంమసాలా - ఒక టీస్పూన్‌, నూనె - తగినంత, ఉప్పు - రుచికి సరిపడా, మెంతులు - పావు టీస్పూన్‌, కారం - తగినంత, ధనియాలు - ఒక టేబుల్‌స్పూన్‌, ఎండుమిర్చి - నాలుగు, సోంపు - ఒక టేబుల్‌స్పూన్‌.


తయారీ విధానం: స్టవ్‌పై ఒక పాన్‌పెట్టి మెంతులు, ధనియాలు, సోంపు, ఎండు మిర్చి వేసి వేగించాలి. చల్లారిన తరువాత వీటిని మిక్సీలో వేసి పొడి చేసి పక్కన పెట్టాలి. కుక్కర్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేగించాలి. కాసేపయ్యాక టొమాటో ముక్కలు వేసి వేగించాలి. టొమాటో మెత్తగా ఉడికిన తరువాత చికెన్‌ వేసి, గరంమసాలా, కారం, ఉప్పు వేసి కలుపుకోవాలి. పావు కప్పు నీళ్లు పోసి మూడు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్‌ తీసుకొని నూనె వేసి వెలుల్లి రెబ్బలు, గోంగూర వేసి వేగించాలి. కొంచెం ఉప్పు, గరంమసాలా వేసి కలుపుకోవాలి. నాలుగైదు నిమిషాలు ఉడికించుకుంటే గోంగూర మెత్తగా పేస్టు మాదిరిగా అవుతుంది. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న చికెన్‌ వేసి కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసి చిన్నమంటపై కాసేపు ఉడికించాలి. అంతే... గోంగూర చికెన్‌ రెడీ.


పాలకూర చికెన్‌ కర్రీకరివేపాకు చికెన్‌ అల్లం చికెన్‌ బ్యాంబూ షూట్స్‌ చికెన్‌ నర్గీసి కబాబ్‌ కా కుర్మాకోఫ్తా ఔర్‌ దహీ కి కాడీకాలియా ఖాసా దో - ప్యాజ్‌క్విక్‌ చికెన్‌! హనీ గార్లిక్‌ చికెన్‌! మరాక్‌
Advertisement