వరి గడ్డికి భలే డిమాండ్‌

ABN , First Publish Date - 2022-01-18T06:04:35+05:30 IST

పశువుల మే తగా వాడే వరి గడ్డికి భలే డిమాండ్‌ ఏ ర్పడింది. ట్రాక్టర్‌ వరి గడ్డి ధర రూ.13 వేల నుంచి రూ.15 వేలు పలుకుతోంది.

వరి గడ్డికి భలే డిమాండ్‌
ట్రాక్టర్‌లో అమ్మకానికి తీసుకువచ్చిన వరి గడ్డి

ట్రాక్టర్‌ గడ్డి రూ.15 వేలు - కర్నూలు జిల్లా నుంచి తరలింపు


యాడికి, జనవరి 17: పశువుల మే తగా వాడే వరి గడ్డికి భలే డిమాండ్‌ ఏ ర్పడింది. ట్రాక్టర్‌ వరి గడ్డి ధర రూ.13 వేల నుంచి రూ.15 వేలు పలుకుతోంది. మండలంలో వర్షాధార పంటలుగా ఎక్కువగా పత్తి, కంది సాగుచేయడంతో పశుగ్రాసం దొరకడం కష్టంగా మారింది. వర్షాకాలం వచ్చే వరకు పశుగ్రాసం నిల్వ చే సుకోవాల్సి ఉండడంతో పశువుల యజమానులు వరి గడ్డిపై ఆసక్తిచూపుతున్నా రు. మండల సరిహద్దులో వరిగడ్డి ఎక్కు వ దొరకకపోవడంతో కర్నూలు జిల్లాకు చెందిన వరి సాగు రైతులు ట్రాక్టర్లలో గడ్డిని తీసుకువచ్చి యాడికి మండలంలో విక్రయాలు జరుపుతున్నారు. యాడికి నుంచి దూరంగా ఉన్న గ్రామాలకు అయితే మరింత అదనపు ధర డిమాండ్‌ చే స్తున్నారు. కర్నూలు జిల్లాలోని అవుకు, కోవెలకుంట్ల తదితర ప్రాంతాల నుంచి వరిగడ్డి తీసుకువచ్చి విక్రయిస్తున్నారు.


Updated Date - 2022-01-18T06:04:35+05:30 IST