జిల్లాలో భక్తిశ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే

ABN , First Publish Date - 2022-04-16T06:12:02+05:30 IST

క్రైస్తవుల ఇష్టదైవం యేసుక్రీస్తు శిలువ వేయబడిన రోజు గుడ్‌ఫ్రైడేను శుక్రవారం పలు చర్చిల్లో ఘనంగా జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయా చర్చిల్లో మతగురువుల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పట్టణంలోని హోలీ ఫ్యామిలీ కెతడ్రల్‌చర్చిలో గుడ్‌ఫ్రైడేను

జిల్లాలో భక్తిశ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే
ఆదిలాబాద్‌లో ఏసు శిలను మోస్తున్న సన్నివేశాన్ని ప్రదర్శిస్తున్న దృశ్యం

ఆదిలాబాద్‌ టౌన్‌, ఏప్రిల్‌ 15: క్రైస్తవుల ఇష్టదైవం యేసుక్రీస్తు శిలువ వేయబడిన రోజు గుడ్‌ఫ్రైడేను శుక్రవారం పలు చర్చిల్లో ఘనంగా జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయా చర్చిల్లో మతగురువుల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పట్టణంలోని హోలీ ఫ్యామిలీ కెతడ్రల్‌చర్చిలో గుడ్‌ఫ్రైడేను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. యేసు మానవాళికి అందించిన దివ్య సందేశాన్ని చర్చిఫాదర్‌ బియోని మ్యాథ్యు వినిపించారు.అనంతరం భక్తులు యేసు త్యాగాలను స్తూతిస్తూ భక్తీగీతాలు ఆలపించారు. క్రీస్తు వేషాధారణలో నాటికను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. శిలువను మోసుకని 14 ప్రత్యేక స్థలాల ను గురించి స్మరించుకుంటూ ప్రార్థించారు.

బేల: మండలంలోని చప్రాల, బేల చర్చిలో ఏసు ప్రభు త్యాగఫలానికి ప్రతిగా గుడ్‌ఫ్రైడే సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. శుక్రవారం చర్చికి భక్తులు తరలివచ్చారు. ఏసుక్రీస్తు త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు.

ఇచ్చోడ: గుడ్‌ ఫ్రైడే సందర్భంగా మండల కేంద్రంలో శుక్రవారం షాలోమ్‌ ప్రార్థన మందిర, విశ్వవాణి, బేథేస్థా, గ్లోరియస్‌ మినిస్ట్రిస్‌ ప్రార్థన మందిరాల్లో ఘనంగా గుడ్‌ఫ్రైడే వేడుకలు నిర్వహించారు. క్రీస్తు శిలువలో పొందిన శ్రమలు గూర్చి ఆయా చర్చిల ఫాదర్‌లు భక్తులకు వివరించారు.  

ఉట్నూర్‌ రూరల్‌: పాపులను రక్షించడం కోసం ఏసుక్రీస్తు తన ప్రాణాలను శిలువపై పెట్టడంతోనే ప్రజల అందరి పాపాలు క్షమింపబడ్డాయని అందరి కోసమే శుభశుక్రవారం నిర్వహించుకోవడం జరుగుతుందని ఉట్నూర్‌ సీఎస్‌ఐ చర్చి పాస్టర్‌ రెవరెండ్‌ జాష్వ అన్నారు. శుక్రవారం స్థానిక సీఎస్‌ఐ చర్చిలో జరిగిన శుభశుక్రవారం వేడుకలకు క్రైస్తవులు హాజరై ప్రార్థనలు నిర్వహించారు. గత 45 రోజుల నుంచి ఉపవాస దీక్షలు బూనిన క్రైస్తవులు శుక్రవారం చర్చికి చేరుకొని చివరి రోజున శుభ శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో  బిపీదాస్‌, ఎలమల మనోహర్‌, హిమదర్‌, కుటికల ఆగస్టిన్‌,  సముద్రాల జాన్‌, కొమ్ము విజ య్‌,  కొమ్ముబాపురావు, తుమ్మల సునిల్‌, అచ్చదేవానందం, తదితరులున్నారు. 

Updated Date - 2022-04-16T06:12:02+05:30 IST