అమ్మవారికి సేవ చేయడం అదృష్టం

ABN , First Publish Date - 2022-01-17T05:04:48+05:30 IST

అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠ మై జోగుళాంబదేవి, బాలబ్రహ్మే శ్వర స్వామి ఆలయాల ఈవోగా సేవలు అందించడం అదృష్టంగా భావించాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి సూచించారు.

అమ్మవారికి సేవ చేయడం అదృష్టం
మంత్రి నిరంజన్‌రెడ్డిని సన్మానిస్తున్న ఈవో, ఆలయ అర్చకుడు

అలంపూరు, జనవరి 16 : అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠ మై  జోగుళాంబదేవి, బాలబ్రహ్మే శ్వర స్వామి ఆలయాల ఈవోగా సేవలు అందించడం అదృష్టంగా భావించాలని  తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి సూచించారు.  ఆదివారం జో గుళాంబ ఆలయాల ఈవో పురేంద ర్‌ కుమార్‌  వనపర్తిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి నిరంజన్‌ రెడ్డిని, హైదరాబాద్‌లో తెలంగాణ టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌ డ్‌ను  మర్యాదపూర్వకం గా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ ఆలయాల అభివృద్ధికి విశేష సేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు దిండగల్‌ ఆనంద్‌ శర్మ, సంజీవ రెడ్డి, రాఘవేంద్ర, నాగేష్‌, గోపి, తదితరులున్నారు.  అలాగే జడ్పీ చైర్‌పర్సన్‌ సరితతిరుప తయ్యను, ఎమ్మెల్యే డాక్టర్‌ వీఎం అబ్రహాంను మర్యాదపూర్వ కంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి సన్మానించారు. కార్యక్ర మంలో  ఆలయ కమిటీ మాజీ చైర్మన్‌ నారాయణ రెడ్డి, రాఘ వేందర్‌, వీరేష్‌ ఉన్నారు.  

Updated Date - 2022-01-17T05:04:48+05:30 IST