దేశానికి సేవచేసే అవకాశం రావడం అదృష్టం

ABN , First Publish Date - 2020-09-21T06:42:19+05:30 IST

దేశానికి సేవలందించే అవకాశం రావడం ఎంతో అదృష్టమని మేడ్చల్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మర్రి దీపిక నర్సింహారెడ్డి అన్నారు

దేశానికి సేవచేసే అవకాశం రావడం అదృష్టం

మేడ్చల్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మర్రి దీపిక నర్సింహారెడ్డి


మేడ్చల్‌: దేశానికి సేవలందించే అవకాశం రావడం ఎంతో అదృష్టమని మేడ్చల్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మర్రి దీపిక నర్సింహారెడ్డి అన్నారు. మేడ్చల్‌ పట్టణానికి చెందిన బొడ్డు రోహన్‌ ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లైయింగ్‌ ఆఫీసర్‌గా ఎంపికై ఎయిర్‌ ఆర్మ్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌లో సేవలందించేందుకు వెళ్తున్నాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో చైర్‌పర్సన్‌  పాల్గొని మాట్లాడుతూ చిన్న వయస్సులోనే రోహన్‌ దేశ భద్రత కోసం సేవలందించేందుకు వెళ్తుండటం అభినందనీయమన్నారు. మనమంతా నేడు ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే అది సైనికుల చలువేనన్నారు.


బార్డర్‌లో ఎంతో మంది సైనికులు తమ ప్రాణాలనొడ్డి దేశానికి రక్షణ కల్పిస్తున్నారన్నారు. మేడ్చల్‌ నుంచి రోహన్‌ ఫ్లైయింగ్‌ ఆఫీసర్‌గా ఎన్నికైనందున ఎంతో గర్వంగా ఉందన్నారు. అనంతరం రోహన్‌ను శాలువాతో సత్కరించి పూలమాలలు వేసి అభినందించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌లు ఎడ్ల  శ్రీనివా్‌సరెడ్డి, జంగయ్యయాదవ్‌, బత్తుల గీతామధుకర్‌యాదవ్‌, రోహన్‌ తల్లిదండ్రులు హరికృష్ణ, ఉమామహేశ్వరీలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-21T06:42:19+05:30 IST