‘దళిత బంధు’ లబ్ధిదారులకు శుభవార్త

ABN , First Publish Date - 2022-05-08T05:07:17+05:30 IST

దళిత బంధు పథకం కింద సెంట్రింగ్‌ మెటీరియల్‌ యూనిట్లు తీసుకున్న లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌రూమ్‌, మన ఊరు- మన బడి పనులకు సెంట్రింగ్‌ మెటీరియల్‌ వినియోగించుకునే ఏర్పాటు చెస్తామని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు తెలిపారు.

‘దళిత బంధు’ లబ్ధిదారులకు శుభవార్త
మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు

- సెంట్రింగ్‌ మెటీరియల్‌ ప్రభుత్వ పనులకు వినియోగం

- రెండు పడక గదుల ఇళ్లు, మన ఊరు- మన బడికి  కూడా..

- కలెక్టర్‌ వెంకట్రావు

- దళిత బంధు సెంట్రింగ్‌ మెటీరియల్‌ లబ్ధిదారులు, సరఫరాదారులతో సమీక్ష


మహబూబ్‌నగర్‌ టౌన్‌, మే 7 : దళిత బంధు పథకం కింద సెంట్రింగ్‌ మెటీరియల్‌ యూనిట్లు తీసుకున్న లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌రూమ్‌, మన ఊరు- మన బడి పనులకు సెంట్రింగ్‌ మెటీరియల్‌ వినియోగించుకునే ఏర్పాటు చెస్తామని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు తెలిపారు. శనివారం ఆయన రెవెన్యూ సమావేశ మందిరంలో దళిత బంధు సెంట్రింగ్‌ మెటీరియల్‌ లబ్ధిదారులు, సరఫరాదారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో దళిత బంధు పథకం కింద సెంట్రింగ్‌ మెటీరియల్‌ కోసం 34 యూనిట్లు ఇచ్చామని, ఈ 34 మంది లబ్ధిదారులు వెంటనే ఇన్వాయిస్‌ సమర్పిస్తే 24 గంటల్లో వారి అకౌంట్లలో దళితబంధు నిధులు జమ చేస్తామని కలెక్టర్‌ తెలిపారు. ఈ మేరకు  గృహ నిర్మాణ శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌తో మాట్లాడి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లకు సెంట్రింగ్‌ మెటీరియల్‌ తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 291 పాఠశాలల్లో మన ఊరు- మనబడి కింద పనులు నిర్వహిస్తున్నారని, ఈ పనులకు కూడా సెంట్రింగ్‌ మెటీరియల్‌ టైఅప్‌ చేయాలని చెప్పారు. కాంట్రాక్టర్ల ద్వారా సెంట్రింగ్‌ మెటీరియల్‌ ముందే డంప్‌ చేసుకొని పనులు జరిగే అన్ని ప్రాంతాలకు పంపించాలని కలెక్టర్‌ గృహ నిర్మాణ ఈఈ వైద్యం భాస్కర్‌ను ఆదేశించారు. షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ది శాఖ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ యాదయ్య గౌడ్‌, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్‌ బాబు రావు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.


మన ఊరు-మనబడి అంచనాలు అప్‌లోడింగ్‌ పరిశీలన


యుద్ధ ప్రాతిపదికన మన ఊరు-మన బడి పథకం వచ్చిన ప్రతిపాదనల పనుల అంచనాల అప్‌ లోడింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహిస్తున్న మన ఊరు- మన బడి అంచనాల అప్‌ లోడింగ్‌ కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అప్‌ లోడింగ్‌ కార్యక్రమానికి హాజరైన ఎగ్జిక్యూటివ్‌ ఏజెన్సీల అధికారులు, ఆయా మండలాల కంప్యూటర్‌ ఆపరేటర్లతో జిల్లా కలెక్టర్‌ నేరుగా మాట్లాడటమే కాకుండా అప్లోడింగ్‌ వివరాలను కంప్యూటర్ల ద్వారా పరిశీలించారు. జిల్లాలో 291 పాఠశాలలో మొదటి విడత మన ఊరు- మన బడి కింద పనులు చేపడుతున్నారు. ముఖ్యంగా పాఠశాల టాయిలెట్స్‌, కిచెన్‌ షెడు,్ల ప్రహరీ నిర్మాణం వీటికి సంబంధించి గతంలో జిల్లా కలెక్టర్‌ పరిపాలన అనుమతులు మంజూరు చేశారని తెలిపారు. ఇప్పుడు వాటన్నిం టిని ఆన్‌లైన్‌ ద్వారా అప్లోడ్‌ చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా ఎగ్జిక్యూటివ్‌ ఏజెన్సీ అధికారులు, కంప్యూటర్‌ ఆపరేటర్లు పాల్గొని పనులను నిర్వహిస్తున్నారు.  

Read more