Advertisement
Advertisement
Abn logo
Advertisement
Mar 28 2021 @ 14:03PM

గుడ్ న్యూస్: భారీగా తగ్గిన బంగారం ధర

న్యూఢిల్లీ : బంగారం ధరల తగ్గుదల కొనసాగుతోంది. వారం రోజుల నుంచి తగ్గుతున్న ధరలు ఆభరణాల ప్రేమికులను ఊరిస్తున్నాయి. 10 గ్రాముల ధర రూ.50 వేలకు చేరి, అందుబాటులో లేకుండా పోతుందని ఆందోళన చెందినవారు, ఇప్పుడు సంతోషంగా ఆభరణాలను కొనుక్కోవచ్చు. ఆదివారం 100 గ్రాముల బంగారం ధర రూ.7,600 తగ్గింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఆదివారం రూ.43,920కి తగ్గింది. ఈ వారం ప్రారంభంలో ఏప్రిల్ డెలివరీ కోసం గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ.44,974 వద్ద ప్రారంభమైంది. ఒక రోజు తర్వాత 100 గ్రాములకు రూ.100 చొప్పున తగ్గింది. మార్చి 23న 100 గ్రాములకు రూ.1,200 తగ్గింది. బుధ, గురు, శుక్రవారాల్లో ఈ తగ్గుదల కొనసాగింది. 


గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం ఆదివారం వివిధ నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు క్రింది విధంగా ఉన్నాయి. 

ఢిల్లీ -  రూ.44,050

ముంబై - రూ.43,000

చెన్నై - రూ.42,320

వడోదర, అహ్మదాబాద్ - రూ.44,440

కేరళ - రూ.41,900

లక్నో - రూ.44,050

బెంగళూరు - రూ.41,900

పుణే - రూ.43,000

విశాఖపట్నం - రూ.41,900

జైపూర్ - రూ.44,050

పాట్నా - రూ.43,000

చండీగఢ్ - రూ.44,050


TAGS: GOLD
Advertisement
Advertisement