గూగుల్ క్రోమ్ వాడే యూజర్లకు శుభవార్త!

ABN , First Publish Date - 2020-05-16T04:11:09+05:30 IST

మనలో చాలామంది మొబైల్ ఫోన్స్‌, ల్యాప్‌టాప్స్‌, కంప్యూటర్లలో గూగుల్ క్రోమ్‌నే ఎక్కువగా వాడుతుంటాం.

గూగుల్ క్రోమ్ వాడే యూజర్లకు శుభవార్త!

ఇంటర్నెట్‌డెస్క్: మనలో చాలామంది మొబైల్ ఫోన్స్‌, ల్యాప్‌టాప్స్‌, కంప్యూటర్లలో గూగుల్ క్రోమ్‌నే ఎక్కువగా వాడుతుంటాం. దానిలో చాలా యాడ్స్ కనబడుతుంటాయి. వీటిలో కొన్ని మన బ్యాటరీని, డేటాను తినేస్తుంటాయి కూడా. ఇలాంటి యాడ్లపై కొరడా ఝుళిపించాలని గూగుల్ క్రోమ్ నిర్ణయించుకుంది. ఇలా బ్యాటరీ, డేటాను అధికంగా వినియోగించుకునే యాడ్లను ఆగస్టు చివరికల్లా బ్లాక్ చేసేస్తామని ప్రకటించింది. ఓ యాడ్ ఉపయోగించుకునే వనరులను బట్టి దాన్ని బ్లాక్ చేస్తామని, ఒకవేళ అనుమతించిన వాటికన్నా ఎక్కువ వనరులను సదరు యాడ్ ఉపయోగిస్తున్నట్లయితే వెంటనే దాన్ని బ్లాక్ చేసేస్తామని క్రోమ్ తెలిపింది.

Updated Date - 2020-05-16T04:11:09+05:30 IST