Abn logo
May 23 2020 @ 23:16PM

పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జూలై నుంచి షూటింగ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు నిజంగా ఇది శుభవార్తే. ఎందుకంటే రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేస్తున్న పవన్ కల్యాణ్ వరుసగా రెండు మూడు సినిమాలకు అంగీకారం తెలిపారు. అందులో ఒక చిత్రం దాదాపు షూటింగ్ కూడా పూర్తి కావచ్చింది. కానీ కరోనా కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్‌తో పవన్ ప్లాన్ అంతా తారుమారు అయింది. అయితే పవన్ కల్యాణ్ ఎప్పుడు ఏ మూడ్‌లో ఉంటారో ఎవరికీ తెలియదు. లాక్‌డౌన్ తర్వాత ఇప్పుడు షూటింగ్స్ చేసే మూడ్ లేదంటాడేమో అని ఫ్యాన్స్ అంతా అయోమయంలో ఉన్నారు. అలాంటి వారందరికీ ఈ న్యూస్ శుభవార్తే. 


ఎలా అంటే పవన్ చేయాలనుకున్న రెండో చిత్రం సంచలన దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్నట్లుగా అధికారికంగా ప్రకటనలు కూడా వచ్చాయి. ఈ చిత్రం జూలై సెకండ్ వీక్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్స్‌లో షూటింగ్ జరుపుకోనున్నట్లుగా చిత్రవర్గాల నుంచి తెలుస్తుంది. విదేశాల్లో షూటింగ్స్‌కు ఇప్పుడప్పుడే ఎలాగూ అనుమతులు ఉండవు కాబట్టి.. మ్యాగ్జిమమ్ షూటింగ్‌ను క్రిష్ సెట్స్‌లోనే చిత్రీకరించాలని ప్లాన్ చేసుకున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. అదీకాక ఒక్కసారి సినిమాని పట్టాలెక్కిస్తే.. క్రిష్ ఎలా పరుగులు పెట్టిస్తాడో ఇప్పటికే చూసి ఉన్నాం. ఈ లాక్‌డౌన్‌లో తన చిత్ర షూటింగ్‌కు సంబంధించి పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్న క్రిష్.. పవన్ సినిమాని చకచకా పూర్తి చేయడం ఖాయం. ఇక ఈ చిత్రం తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ సినిమా తెరకెక్కనుంది. 

Advertisement
Advertisement
Advertisement