బస్సుల్లో భౌతిక దూరానికి గుడ్‌బై.. ఆందోళనలో ఆరోగ్యశాఖ

ABN , First Publish Date - 2020-06-05T13:59:13+05:30 IST

రాష్ట్రంలో నడుపుతున్న ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణికులు భౌతిక దూరం పాటించకుండా కిక్కిరిసి ప్రయాణించడంపై ఆరోగ్యశాఖ

బస్సుల్లో భౌతిక దూరానికి గుడ్‌బై.. ఆందోళనలో ఆరోగ్యశాఖ

చెన్నై: రాష్ట్రంలో నడుపుతున్న ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణికులు భౌతిక దూరం పాటించకుండా కిక్కిరిసి ప్రయాణించడంపై ఆరోగ్యశాఖ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెన్నై సహా నాలుగు జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో ఈ నెల 1వ తేదీ నుంచి ప్రభుత్వ బస్సుల సేవలు ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలివిడతగా 5,500 బస్సులు నడుపుతున్నట్టు, ఒక్కో బస్సుల్లో భౌతిక దూరం పాటించేలా 20 లేదా 30 మంది ప్రయా ణికులు ఎక్కించుకోనున్నట్టు ప్రభుత్వ రవాణా సంస్థ ప్రకటించింది. కానీ, పలు మార్గాల్లో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉందని పేర్కొంటూ బస్సులను కూడా తగ్గించారు. దీంతో బస్సు కోసం విధులు, పనులకు వెళ్లేవారు చాలాసేపు వేచి ఉండాల్సిన పరిస్థితులు నెల కొన్నాయి. ఒకే ఒక బస్సు రావడంతో ప్రజలు నిబంధనలను గాలికొదిలేస్తున్నారు. మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా ఇలాంటి చర్యలతో మరింత ప్రబలే అవకాశముందని, దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి, తగినన్ని బస్సులు నడపాలని ఆరోగ్యశాఖ నిపుణులు, సంఘసేవకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - 2020-06-05T13:59:13+05:30 IST