జాత్యహంకారంపై పోరుకు రూ.280 కోట్లు: గూగుల్‌

ABN , First Publish Date - 2020-06-05T07:42:12+05:30 IST

నల్ల జాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యకు వ్యతిరేకంగా అమెరికావ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలకు గూగుల్‌ మద్దతు తెలిపింది. ఈ నేపథ్యంలో జాత్యహంకారం పోరాడేందుకు రూ.280 కోట్లు (37 మిలియన్‌ డాలర్లు) ఖర్చుచేస్తామని ఆ సంస్థ సీఈఓ సుందర్‌ పిచ్చయ్‌ ప్రకటించారు...

జాత్యహంకారంపై పోరుకు రూ.280 కోట్లు: గూగుల్‌

వాషింగ్టన్‌, జూన్‌ 4: నల్ల జాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యకు వ్యతిరేకంగా అమెరికావ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలకు గూగుల్‌ మద్దతు తెలిపింది. ఈ నేపథ్యంలో జాత్యహంకారం పోరాడేందుకు రూ.280 కోట్లు (37 మిలియన్‌ డాలర్లు) ఖర్చుచేస్తామని ఆ సంస్థ సీఈఓ సుందర్‌ పిచ్చయ్‌ ప్రకటించారు. ఈ మేరకు బుధవారం తన ఉద్యోగులకు ఆయన ఈ-మెయిల్‌ పంపారు. 37 మిలియన్‌ డాలర్లలో 12 మిలియన్‌ డాలర్లను (రూ.91 కోట్లు) సమన్యాయం కోసం పోరాడుతున్న సంస్థలకు అందిస్తామని, మిగిలిన నిధులను జాత్యహంకార అసమానతలపై పోరాడుతున్న సంస్థలు కీలక సమాచారాన్ని సమకూర్చేందుకు ఇస్తామని తెలిపారు. దీంతోపాటు జౌౌజజ్ఛూ.ౌటజ ఫెలోవ్స్‌ ప్రోగ్రాం ద్వారా సాంకేతిక సాయం కూడా అందిస్తామని చెప్పారు.


Updated Date - 2020-06-05T07:42:12+05:30 IST