Advertisement
Advertisement
Abn logo
Advertisement

వర్క్ ఫ్రం హోం ఉద్యోగుల జీతాల్లో కోత.. గూగుల్ నిర్ణయం..?

న్యూఢిల్లీ: ఎల్లప్పుడూ ఇంటి నుంచే పని చేసే విధానాన్ని(పర్మెనెంట్ వర్క్ ఫ్రం హోం) ఎంచుకున్న ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టే యోచనలో గూగుల్ ఉన్నట్టు తెలుస్తోంది. ఫలితంగా.. ఒకే కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాల్లోనూ వ్యత్యాసం కనిపించొచ్చని సమాచారం. వేతనాల్లో దాదాపు 25 శాతం మేర కోత పెట్టేందుకు గూగుల్ సిద్ధమవుతోందట. కాగా.. దీనిపై గూగుల్ అధికార ప్రతినిధి ఒకరు స్పందించారు. ఉద్యోగి ఎక్కడ నివసిస్తున్నాడనే అంశం ఆధారంగా అతడి వేతనాన్ని నిర్ణయించే పద్ధతిని గూగుల్ ఎప్పటినుంచో అమలు చేస్తోందని పేర్కొన్నారు.

Advertisement
Advertisement