Advertisement
Advertisement
Abn logo
Advertisement

యూజర్లకు మరింత దగ్గరగా... గూగుల్‌ మ్యాప్స్‌

శీతాకాలం సెలవులను దృష్టిలో పెట్టుకుని గూగుల్‌ మ్యాప్‌ కొత్త అప్డేట్స్‌తో ముందుకు వచ్చింది. గూగుల్‌ నేవిగేషన్‌ యాప్‌ కోసం కొత్త ఫీచర్లను విడుదల చేసింది. కొవిడ్‌ నిబంధనలను సడలిస్తున్న నేపథ్యంలో సురక్షితంగా ఉండటానికి తోడు తమకు ఇష్టమైన ప్రాంతాల్లో గరిష్ఠ సమయం గడిపేందుకు వినియోగదారులకు సహకరించే లక్ష్యంతో గూగుల్‌ మ్యాప్స్‌కు ఈ అప్డేట్స్‌ చేసింది. 


ఏరియా బిజినెస్‌

ఈ యాప్‌తో దగ్గర్లో ఉన్న ప్రాంతం, పట్టణం లేదంటే రద్దీగా ఉన్నది అప్పటికప్పుడు గూగుల్‌ మ్యాప్‌ వినియోగదారుడు తెలుసుకోవచ్చు. ఆ రద్దీని తప్పించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రత్యామ్నాయంగా చుట్టుపక్కల ఏయే ప్రాంతాలు లైవ్లీ అన్నది కూడా సూచిస్తుంది. పర్యాటకులకు  ప్రత్యేకించి ఒక పట్టణంలో పాపులర్‌ ప్రాంతాలను చెక్‌ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఇందుకోసం గూగుల్‌ మ్యాప్‌ యూజర్లు నైబర్‌హుడ్‌ను టాప్‌ చేయాలి. సదరు ప్రాంతాల్లో ఒక రోజులో ఏయే సమయాల్లో బిజీగా ఉంటుందో తెలుస్తుంది. అలాగే అక్కడి రెస్టారెంట్లు, షాప్స్‌, రిక్రియేషన్‌ ప్రదేశాలను కూడా తెలుసుకోవచ్చు. 


డైరక్టరీ ట్యాబ్‌

ఈ ఫీచర్‌తో పెద్ద పెద్ద భవనాల మధ్య ఉన్న షాపింగ్‌ మాల్స్‌ను తెలుసుకోవచ్చు.  ప్రపంచంలోని విమానాశ్రయాలు, మాల్స్‌, ట్రాన్సిట్‌ స్టేషన్లకు దీన్ని విస్తరించింది. ఒక బిల్డింగ్‌లోని షాపులో ఏయే వస్తువులు అమ్ముతున్నారు అని, అలాగే విమానాశ్రయ లాంజ్‌లు, కార్ల అద్దెలు, పార్కింగ్‌ ప్రాంతాలను తెలుసుకోవచ్చు. మళ్ళీ ప్రతి కేటగిరిలో సంబంధిత వ్యాపారాలు, ఓపెన్‌ అయి ఉన్నాయా లేదా అలాగే బిల్డింగ్‌లో ఏ ఫ్లోర్‌లో అది ఉంది, రేట్లను కూడా తెలుసుకోవచ్చు. 


పికప్‌

గూగుల్‌ మొదట ఫోర్ట్‌లాండ్‌, ఒరెగాన్‌లో ఎంపిక చేసిన ఫ్రెడ్‌ మేయర్స్‌ స్టోర్స్‌ పికప్‌ లొకేషన్లను పరిచయం చేసింది. అమెరికాలోని మరిన్ని లొకేషన్స్‌కు విస్తరిస్తోంది. ఒక వస్తువును ఆర్డర్‌ చేస్తే దాని స్టేటస్‌ యావత్తు ఈ యాప్‌తో తెలుసుకునే వీలు ఉంది. క్రోగర్‌ ఫ్యామిలీ స్టోర్స్‌కు విస్తరిస్తోంది. అమెరికాలోని ముప్పయ్‌ రాష్ట్రాల్లోని రెండు వేల స్టోర్స్‌కు వ్యాపించింది. అమెరికాలోని తన వినియోగదారుల కోసం ధరలకు తోడు వివిధ ప్రాంతాలు, అక్కడి రెస్టారెంట్ల తదిరాలపై రెవ్యూ సేవలను కూడా గూగుల్‌ సదరు ఫీచర్లతో అందిస్తోంది. 

Advertisement
Advertisement