మొబైల్స్‌లో సెర్చ్‌కు గూగుల్‌ కొత్త ఫీచర్‌

ABN , First Publish Date - 2021-10-23T05:30:00+05:30 IST

మొబైల్స్‌లో సెర్చ్‌ కోసం గూగుల్‌ కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చినట్లు ఒక బ్లాగ్‌పోస్టులో తెలిపింది. ‘కంటిన్యూయస్‌ స్ర్కోలింగ్‌’ అంటే సెర్చ్‌ ...

మొబైల్స్‌లో సెర్చ్‌కు గూగుల్‌ కొత్త ఫీచర్‌

మొబైల్స్‌లో సెర్చ్‌ కోసం గూగుల్‌ కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చినట్లు ఒక బ్లాగ్‌పోస్టులో తెలిపింది. ‘కంటిన్యూయస్‌ స్ర్కోలింగ్‌’ అంటే సెర్చ్‌ పేజీ చివరకు చేరేసరికి, తరవాత పేజీ ఆటోమేటిక్‌గా అక్కడ లోడ్‌ అయిపోతుంది. రీ డిజైన్డ్‌ సెర్చ్‌ పేజీతో సమాచారం నిరంతరాయంగా అలా కొనసాగుతూనే ఉంటుంది. 


సాధారణంగా సెర్చ్‌ చేసే వ్యక్తులు మొదటి నాలుగైదు రిజల్ట్స్‌ చూసి ఆగిపోతుంటారు. ఎక్కువలో ఎక్కువ మూడు నాలుగు పేజీలను దాటరట. కొత్త విధానంలో నిరంతరాయంగా సమాచారానికి సంబంధించిన లింకులు వస్తే యూజర్‌కి మరింత ఉపయోగకరంగా ఉంటుందని గూగుల్‌ భావిస్తోంది. మొదట ఈ సదుపాయం అమెరికాలో, ఇంగ్లీ్‌షలో అందుబాటులోకి వస్తుంది. 


అలాగే  ఐఓఎస్‌ 15, ఐపాడ్‌ 15పై యాప్స్‌, సర్వీసులను గూగుల్‌ ఇటీవలే అప్‌డేట్‌ చేసింది. జీమెయిల్‌, మీట్‌, టాస్క్స్‌ తదితరాల విషయంలో ఈ అప్‌డేట్‌ జరిగింది. 

Updated Date - 2021-10-23T05:30:00+05:30 IST