‘గూగుల్​ పే’లో... ఈ టిప్స్ పాటిస్తే భారీగా ‘క్యాష్​ బ్యాక్​’లు...

ABN , First Publish Date - 2022-01-21T01:37:17+05:30 IST

ఆన్​లైన్ పేమెంట్​ యాప్... ‘గూగుల్ పే’... అందరికీ తెలిసిందే. ఈ యాప్​ తొలినాళ్లలో కేవలం క్యాష్​ బ్యాక్​లు, ఆ తర్వాత క్యాష్ బ్యాక్​లతో పాటు గిఫ్ట్ ఓచర్​లను అందిస్తోంది.

‘గూగుల్​ పే’లో... ఈ టిప్స్ పాటిస్తే  భారీగా ‘క్యాష్​ బ్యాక్​’లు...

హైదరాబాద్ : ఆన్​లైన్ పేమెంట్​ యాప్... ‘గూగుల్ పే’... అందరికీ తెలిసిందే. ఈ యాప్​ తొలినాళ్లలో కేవలం క్యాష్​ బ్యాక్​లు, ఆ తర్వాత క్యాష్ బ్యాక్​లతో పాటు గిఫ్ట్ ఓచర్​లను అందిస్తోంది. కాగా... ఇటీవలి కాలంలో క్యాష్​ బ్యాక్​లు భారీగా తగ్గిన విషయం తెలిసింనదే. స్క్రాచ్​  కార్డ్​లలో ఎక్కవ శాతం 'బెటర్ లక్ నెక్స్ట్ టైం' అన్న పదాలే కనిపిస్తున్నాయి. ఇలా ఎందుకు జరుగుతోందంటే... ఈ కథనం చదవండి... గూగుల్​ పేలో క్యాష్​ బ్యాక్​లు ఎక్కువగా రావాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలన్న విషయమై విశ్లేషకుల సలహాలిలా ఉన్నాయి. 


గూగుల్​పేలో మంచి క్యాష్​ బ్యాక్ రావాలంటే... ముందుగా  ఒకే ఖాతా(ఒకే యూజర్​తో) నంబర్​తో ఎక్కువ సార్లు లావాదేవీలు జరపకూడదు. అలా చేస్తే క్యాష్‌బ్యాక్ వచ్చే అకాశాలు తగ్గిపోతుంటాయి. అందుకే కొత్త అకౌట్లతో లావాదేవీలు జరపడం ద్వారా క్యాష్​ బ్యాక్ పొందే అవకాశాలు ఎక్కువగా(క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ ఇన్ జీ పే) ఉంటాయి. ఒకే సారి భారీ మొత్తంలో లావాదేవీలను నిర్వహించడం కూడా క్యాష్​‌బ్యాక్ ఆఫర్లు తగ్గేందుకు కారణం కావచ్చునని విశ్లేషకులు చెబుతున్నారు. అలా కాకుండా... తక్కువ మొత్తాల్లో లావాదేవీలను నిర్వహించడం ద్వారా క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఎక్కువగా(డోన్ట్స్ ఇన్ గూగెల్ పే) పొందొచ్చు.


ఎక్కువగా వినియోగంలో లేని ఖాతాతో లావాదేవీలు జరపడం కూడా క్యాష్‌బ్యాక్​లు తగ్గేందుకు కారణం కావచ్చునని చెబుతున్నారు. అలా కూకుండా... రెగ్యులర్​గా వినియోగంలో ఉన్న అకౌంట్​కు, గూగుల్​ పేను అధికంగా వినియోగించే అకౌంట్లలతో లావాదేవీలు జరపడం ద్వారా క్యాష్​ బ్యాక్​లు అధికంగా పొందే వీలుంటుందని చెబుతున్నారు. ఇక... సింగిల్​ డిజిట్ అమౌంట్​ ట్రాన్సాక్షన్​ చేయడం వల్ల క్యాష్​బ్యాక్ పొందే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే... కనీసం రూ. 150 నుంచి రూ. 500 మధ్య లావాదేవీలు  చేయడం ద్వారా క్యాష్(క్యాష్‌బ్యాక్ పొందాలంటే ‘గూగుల్ పే’ లో లావాదేవీ చేయాల్సిన కనీస మొత్తం) క్యాష్‌బ్యాక్ పొందవచ్చని చెబుతున్నారు. 

Updated Date - 2022-01-21T01:37:17+05:30 IST